తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆపరేషన్‌ వాలెంటైన్‌' రివ్యూ- గూస్​బంప్స్ గ్యారెంటీ సీన్స్​!- సినిమా ఎలా ఉందంటే? - Operation Valentine Cast

Operation Valentine ReviewL మెగా ప్రిన్స్ వరుణ్​తేజ్- శక్తి ప్రతాప్‌ సింగ్‌ కాంబోలో తెరకెక్కిన 'ఆపరేషన్ వాలెంటైన్‌' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?

Operation Valentine Review
Operation Valentine Review

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 8:04 AM IST

Operation Valentine Review:Operation Valentine Review: సినిమా: ఆపరేషన్‌ వాలెంటైన్‌; నటీనటులు: వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌, నవదీప్‌, రుహానీ శర్మ,మిర్‌ సర్వర్‌ తదితరులు; దర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా; సంగీతం: మిక్కీ జే మేయర్‌; సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం; ఎడిటింగ్‌: నవీన్‌ నూలి; సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా; నిర్మాత: సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్ద; రిలీజ్ డేట్: 01-03-2024

భారతీయ ఫిల్మ్​ ఇండస్ట్రీలో ఏరియల్ యాక్ష‌న్ జాన‌ర్​ సినిమాలు ఇప్పుడిప్పుడే తెరకెక్కుతున్నాయి. రీసెంట్​గా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్ 'ఫైట‌ర్‌' తెరకెక్కగా, తాజాగా తెలుగులో మెగా హీరో వరుణ్​తేజ్ 'ఆప‌రేష‌న్ వాలెంటైన్‌' (Operation Valentine Review ) రూపొందింది. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ తరహా సినిమా రావడం ఇదే తొలిసారి. మరి మెగా హీరో చేసిన ప్రయత్నం ఫలించిందా? అసలు సినిమా ఎలా ఉంది?

క‌థేంటంటే: అర్జున్ రుద్ర‌దేవ్ అలియాస్ రుద్ర (వ‌రుణ్‌తేజ్‌) ఇండియన్ ఎయిర్ ఫోర్స్​లో స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌. 'ఏం జ‌రిగినా చూసుకుందాం' అనే టైపు. అతడు అదే ఎయిర్ ఫోర్స్​లో పనిచేసే తన కొలీగ్​ రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్ (మానుషి చిల్ల‌ర్‌)తో ప్రేమ‌లో ఉంటాడు. ప్రాజెక్ట్ వ‌జ్ర కోసం చేసే ప్రయత్నంలో అతడికి చేదు అనుభ‌వం ఎదుర‌వుతుంది. దీంతో దాని నుంచి కోలుకునే క్రమంలో 'ఆప‌రేష‌న్ వాలెంటైన్' కోసం రంగంలోకి దిగుతాడు. మరి ఈ ప్రాజెక్ట్ వ‌జ్ర, ఆప‌రేష‌న్ వాలెంటైన్ అంటే ఏంటో బిగ్ స్క్రీన్​పై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే:ఈ మూవీ నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. భార‌త్‌- పాకిస్థాన్‌ మ‌ధ్య జరిగిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్ర‌తికారంగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన ఎయిర్ స్ట్రైక్ అన్ని సంఘటనలు ఇందులో చూపించారు. రెండు దేశాల మ‌ధ్య పోరాటం, దేశ‌భ‌క్తి అన‌గానే మెజారిటీ పౌరులకు ఆర్మీయే గుర్తొస్తుంది. కానీ, దేశాల్ని ర‌క్షించ‌డంలో త్రివిధ ద‌ళాల‌దీ కీల‌క‌పాత్రే. సైనిక, నావిక, వైమానిక ద‌ళాల్లో ఎవరి ప్రత్యేకత వారిదే. గగనతలంలో కాప‌లా కాస్తూ, శ‌త్రువుల నుంచి రక్షణ ఇచ్చే వైమానిక ద‌ళం పాత్ర పెద్ద‌గా వెలుగులోకి రాలేదు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ త‌ర్వాత మ‌న వైమానిక ద‌ళం కీర్తి ఎక్కువ మందికి రీచ్ అయ్యింది.

ఫైట‌ర్ జెట్ పైల‌ట్ అయిన హీరో ధైర్యసాహ‌సాలు, దేశ‌భ‌క్తి నేప‌థ్య‌ం కీలకంగా రూపొందిన చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ ప్రాజెక్ట్ వజ్రతో కథ మొదలుపెట్టి ఆ త‌ర్వాత ఒక్కొక్క సంఘ‌ట‌న‌ని తెర‌పై చూపించాడు. పుల్వామా దాడికి ప్రతి చర్యగా ఆప‌రేష‌న్ వాలెంటైన్‌, ఆ త‌ర్వాత పాకిస్థాన్‌ ఆర్మీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ నెహ్రూ, దాన్ని తిప్పి కొట్టేందుకు వ‌జ్ర ప్ర‌యోగాన్ని అమ‌లు చేయ‌డం వంటి సంఘ‌ట‌న‌ల‌తో ఈ కథ సాగుతుంది. ఈ క్రమంలో దేశ‌భ‌క్తి నేప‌థ్యం, ఎమోషనల్ ఎలివెంట్స్​ బాగా చూపించారు. శ‌త్రువుల స్థావ‌రాల్ని ధ్వంసం చేసే సీన్స్​ గూస్​బంప్స్​ తెప్పిస్తాయి. అయితే హీరోహీరోయిన్ల మధ్య లవ్​ ట్రాక్, రీసెంట్​గా వచ్చిన 'ఫైటర్' మూవీకి సింబాలిక్​గా ఉండే సీన్స్​ కాస్త మైనస్​గా మారాయి.

బ‌లాలు

  • దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా సాగే స‌న్నివేశాలు
  • వ‌రుణ్‌తేజ్, మానుషి చిల్ల‌ర్‌
  • విజువ‌ల్స్
    బ‌ల‌హీన‌త‌లు
  • క‌థ‌నం
  • కొర‌వ‌డిన భావోద్వేగాలు

చివ‌రిగా: 'ఆప‌రేష‌న్ వాలెంటైన్' గ‌గ‌న‌వీధిలో పోరాటం

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఆపరేషన్ వాలెంటైన్ - 'ఆ సినిమా కోసం నా పెళ్లి ముహూర్తాన్ని మార్చుకున్నా'

లావణ్య త్రిపాఠితో లవ్​ - వరుణ్ తేజ్​పై కోపం పెంచుకున్న చిరు!

ABOUT THE AUTHOR

...view details