NTR Devara Movie : 'దేవర' రాకకు మరో వారం రోజులే సమయం మిగిలి ఉంది. దీంతో సోషల్ మీడియాతో పాటు బయట సినీ ప్రియుల్లో టాక్ అంతా ఈ సినిమా గురించే. అందుకు తగ్గట్టే మూవీటీమ్ కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తోంది. తారక్ కూడా వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను చెబుతున్నారు. ఇప్పటికే ముంబయి ఈవెంట్లను పూర్తి చేసిన ఎన్టీఆర్ రీసెంట్‌గానే చెన్నై ఈవెంట్లను కంప్లీట్ చేశారు. అక్కడి స్టార్ హీరోలు, దర్శకులపై ప్రశంసలు కురిపిస్తూ అక్కడి ఆడియెన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.
చీఫ్ గెస్ట్‌గా ఎవరో? - ఇక తెలుగులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోనే ఈ నెల 22న దీన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే రెండు మూడు వేదికల పేర్లు వినిపిస్తున్నాయి కానీ, ఎక్కడ నిర్వహించనున్నారో మూవీటీమ్ ఇంకా పక్కాగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ వస్తారని టాక్ వినిపిస్తోంది. అలానే సూపర్ స్టార్ మహేశ్ బాబు వస్తారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు(Devara PreRelease Business) - నైజాం ఏరియాలో 'దేవర' రూ.45 కోట్లకు అమ్ముడు పోయిందని సమాచారం అందుతోంది. గతంలో ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలు నైజాం ఏరియాలో భారీగానే కలెక్షన్లను అందుకున్నాయి. కాబట్టి ఈ సారి నైజాంలో రూ.50 కోట్ల షేర్ వస్తుందని అనుకుంటున్నారట. సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్ వినిపిస్తోంది. పైగా సీడెడ్ నందమూరి ఫ్యాన్స్‌కు అడ్డ! కాబట్టి ఇక్కడ రూ.25 కోట్ల షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
వైజాగ్‌లో రూ.12.5 కోట్లు,ఈస్ట్ రూ.8 కోట్లు, వెస్ట్ రూ.6 కోట్లు, కృష్ణా రూ. 7 కోట్లు, గుంటూరు రూ. 8.5 కోట్లు, నెల్లూరు రూ. 4 కోట్లు అని టాక్ నడుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.115 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. కర్ణాటకలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అక్కడ రూ.15 కోట్లకు అమ్ముడుపోయిందట. తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్‌లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.15 కోట్లు అని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంటే ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్ వసూళ్లు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.