NTR 31 Title :టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే కౌంట్‌డౌన్ మొదలైంది. దీంతో ఫ్యాన్స్ తన కొత్త మూవీస్‌కు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మూవీ యూనిట్స్ కూడా ఎన్టీఆర్ బర్త్‌డే కోసం పలు స్పెషల్స్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే 'దేవర' నుంచి రానున్న ఫస్ట్ సింగిల్‌కు మరింత హైప్ పెరిగిపోగా, ఇప్పుడు మరో ఆయన అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన ఓ సాలిడ్ రూమర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్, 'కేజీఎఫ్' ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రానున్న 'NTR 31' మూవీ కోసం ఓ పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్. 'డ్రాగన్' అనే పేరులో పరిశీలనలో ఉంచారని, దాదాపు అదే ఫిక్స్ చేయనున్నారట. ఇక ఎన్టీఆర్ బర్త్‌డే కోసం ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారట. ఒకవేళ అప్పటికి టైటిల్ ఫిక్స్ అయితే దాన్ని కూడా మేకర్స్ అదే పోస్టర్ ద్వారా రివీల్ చేయనున్నట్లు సినీ వర్గాల టాక్.
ఇదిలా ఉండగా, త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట. ఇందులో భాగంగా మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. తారక్ ప్రస్తుతం వరుస షూటింగుల్లో బిజీగా ఉన్నందున ఆ చిత్రీకరణ పూర్తయ్యాకనే 'ఎన్టీఆర్ 31' సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమచారం.