తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అప్పుడు ఎఫ్​ 1 - ఇప్పుడు బ్యాడ్మింటన్​ - ఈ బ్యూటీ రెండింటిలోనూ టాపే! - నివేదా పేతురాజ్‌ ఎఫ్​1 రేసింగ్

Nivetha Pethuraj Badminton : కోలీవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్ తాజాగా తనలోని మరో ట్యాలెంట్​ను చూపించి అభిమానులను అబ్బురపరిచింది. ఇప్పటి వరకు ఎఫ్​1లో చెలరేగిపోయిన ఈ అమ్మడు ఇప్పుడు బ్యాడ్మింటన్​లోనూ రాణిస్తోంది.

Nivetha Pethuraj Badminton
Nivetha Pethuraj Badminton

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 6:59 AM IST

Updated : Jan 24, 2024, 8:46 AM IST

Nivetha Pethuraj Badminton : తన నటనతో అటు కోలీవుడ్​తో పాటు ఇటు టాలీవుడ్​లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది నటి నివేదా పేతురాజ్. తొలుత డబ్బింగ్ సినిమాలతో ఫేమస్​ అయిన ఈ తార ఆ తర్వాత తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. అయితే తాజాగా ఆమె తనలోని మరో ట్యాలెంట్​ను చూపించింది.

తమిళనాడులోని మధురైలో జరిగిన ఓ బ్యాడ్మింటన్​ టోర్నీలో కప్​ సాధించి అబ్బురపరిచింది. మిక్డ్స్ డబుల్స్‌లో కప్పు సాధించినట్లు అందులో రాసుంది. దీనికి సంబధించిన ఫొటోలు షేర్​ చేసింది. దీన్ని చూసిన అభిమానులకు ఆమెకు కంగ్రాజ్యూలేషన్స్​ చెబుతున్నారు. ఈమెలో ఇంకెన్ని ట్యాలెంట్స్​ ఉన్నాయో అంటూ కామెంట్​ చేస్తున్నారు. గతంలోనూ ఈ చిన్నది రేసింగ్​లోనూ తనకు పట్టు ఉన్నట్లు నిరూపించింది. ఎఫ్1 రేసింగ్​లో సూపర్ స్పీడ్​లో దూసుకెళ్లింది. సర్టిఫైడ్‌ కార్‌ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇలా నటనలోనే కాదు క్రీడల్లోనూ సత్తా చాటుతూ అందరినీ అలరిస్తోంది.

Nivetha Pethuraj Movies : ఇక నివేదా కెరీర్ విషయానికి వస్తే - మోడలింగ్​తో కెరీర్​ మొదలుపెట్టి అనతికాలంలోనే కోలీవుడ్​లో మంచి స్టార్​గా రాణించింది నివేదా. 'మెంటల్ మదిలో' అనే తెలుగు సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నది ఆ తర్వాత 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా', 'రెడ్', 'పాగల్', 'అల వైకుంఠపురంలో' లాంటి చిత్రాల్లో నటించి ఆడియెన్స్​ను ఆకట్టుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ వేదికగా విడుదలైన 'బ్లడీ మేరి' అనే క్రైమ్​ థ్రిల్లర్​లో కీ రోల్​ ప్లే చేసి తనలోని కొత్త కోణాన్ని చూపించింది. ఆ తర్వాత విశ్వక్​ సేన్ సరసన 'దాస్​ కా ధమ్కీ ' సినిమాలో కనిపింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 'విరాట్ పర్వం'లో గెస్ట్​ రోల్​ చేసి ఆకట్టుకుంది. 'బూ' అనే హారర్​ థ్రిల్లర్​లోనూ కనిపించి ఆకట్టుకుంది. సినిమాల్లోనే కాకుండా వెబ్​ సిరీస్​ల్లోనూ మెరుస్తోంది. తాజాగా 'కాలా' అనే హిందీ సిరీస్​లో నటించింది.

Last Updated : Jan 24, 2024, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details