తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'10నిమిషాలకు ఓ ట్విస్ట్- క్లైమాక్స్ వేరే లెవెల్'- కొత్త సినిమాపై నిఖిల్ కామెంట్స్​ - NIKHIL APPUDO IPPUDO EPPUDO

'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'పై నిఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్- సినిమాలో ట్విస్ట్​లు, క్లైమాక్స్​ వేరే లెవెల్​ అంట!

Nikhil Appudo Ippudo Eppudo
Nikhil Appudo Ippudo Eppudo (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2024, 11:44 AM IST

Nikhil Ippudo Eppudo Movie :టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ కథానాయకుడిగా దర్శకుడు సుధీర్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. 'స్వామిరారా', 'కేశవ' తర్వాత వీళ్లిద్దరి నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నవంబరు 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. అందులో భాగంగా హీరో నిఖిల్ సిద్ధార్థ్ రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సమయంలో సినిమాపై అంచనాలను పెంచేస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'క్లైమాక్స్ అదిరిపోద్ది'
ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుందని నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే క్లైమాక్స్‌ ను ఎవరూ ఊహించలేరని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా మెప్పిస్తుందని అభిప్రాయపడ్డారు. స్వామి రారాలో మిస్ అయిన ప్రేమకథను 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' దర్శకుడు చూపించారని పేర్కొన్నారు. ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ మూవీ స్క్రీన్‌ ప్లే ఉంటుందని వెల్లడించారు. దీంతో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఆదివారం రాత్రి బాలీవుడ్​కు చెందిన ప్రముఖల కోసం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' స్క్రీనింగ్ చేశారు. ఈ సినిమా వారికి నచ్చినట్లు తెలుస్తోంది. పరిశ్రమ పెద్దల నుంచి ఈ మూవీ గుడ్ టాక్ తెచ్చుకున్నట్లు సమాచారం. అలాగే మూవీ ప్రమోషన్స్​లో నిఖిల్ చేసిన కామెంట్లను బట్టి సినిమా ఏ రేంజ్​లో ఉంటుందో అర్థమవుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సినిమా అదిరిపోతుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

సినిమా విషయానికొస్తే, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ హీరోయిన్​గా నటించింది. దివ్యాంశ కౌశిక్‌ కీలక పాత్ర పోషించింది. శ్రీ వేంకటేశ్వర , శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్లపై బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ఫస్ట్ లుక్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నో అప్​డేట్స్​​ - రిలీజ్‌కు రెడీగా ఉన్న నిఖిల్‌ మూవీ!- ఏదంటే? - Nikhil New Movie

నిఖిల్ 'స్వయంభు' - ఆయుధపూజ మొదలు

ABOUT THE AUTHOR

...view details