Nikhil Siddhartha Baby :టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ తాజాగా తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. తన భార్య పల్లవి బుధవారం ఓ పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చారు. తాజాగా నిఖిల్ ఆ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు ఆ చిన్నారిని దీవిస్తూ ఈ జంటకు కంగ్రాజ్యులేషన్ చెప్తున్నారు.
ఇటీవలే తన సతీమణికి సీమంతం జరిగినట్లు నిఖిల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. "నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డ స్వాగతం పలకనున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు అందించండి.' అంటూ నిఖిల్ పోస్ట్ చేశారు. ఇక అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో నిఖిల్ పల్లవి స్నేహితులు ఈ జంటను ఆటపట్టించారు. పుట్టబోయే బేబీకి ఎలా డైపర్ వెయ్యాలంటూ నిఖిల్‌కు ట్రైనింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 2020లో నిఖిల్ - పల్లవి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. లాక్డౌన్ కారణంగా అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే - 'హ్యాపీడేస్' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో, తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన పలు తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. 'కార్తికేయ-1', 'స్వామి రారా', 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు.