Squid Game 2 Trailer Released : ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణను దక్కించుకున్న కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా 2021లో విడుదలై సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సిరీస్‌కు కొనసాగింపుగా 'స్క్విడ్ గేమ్ 2' రెడీ అవుతోంది. డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ ఈ సీక్వెల్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.
తొలి సీజన్ తరహాలోనే రెండో సీజన్లోనూ ఆర్థికంగా ఇబ్బందులు పడే కొంత మంది, డబ్బు సంపాదించడం కోసం ఈ గేమ్‌లో భాగం అవుతారు. అయితే గత సీజన్‌లో ఈ డేంజరస్ గేమ్ నుంచి బయటపడిన 456వ పోటీ దారుడు సియోంగ్ గి-హున్ ఇందులో మళ్లీ పాల్గొంటాడు. ఈ గేమ్ చాలా డేంజరస్ అని తోటి పోటీ దారులకు హెచ్చరిస్తాడు. ఎలాగైనా ఈ గేమ్‌ను ఆపాలని ప్రయత్నిస్తుంటాడు. అసలు ఈ గేమ్‌ను ప్రవేశపెట్టిన వారికి అంతమొందించాలనుకుంటాడు. మరి ఇంతకీ అతడు ఈ గేమ్‌ను ఆపగలిగాడా లేదా అన్నదే కథ.
ఇంతకీ ఈ 'స్క్విడ్ గేమ్' స్టోరీ ఏంటంటే?