Naveen Polishetty Accident Health Update: 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' వంటి చిత్రాలతో టాలీవుడ్లో మంచి హీరోగా నవీన్ పోలిశెట్టి గుర్తింపు పొందారు. అయితే ఆయనకు అమెరికాలో ప్రమాదం జరిగినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన చేతికి ఫ్రాక్చర్ అయ్యిందని, దాదాపు రెండు నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు కథనాలు వచ్చాయి. అయితే హీరో నవీన్ పోలిశెట్టి తాజాగా దీనిపై స్పందించారు. తన అఫీషియల్ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ వేదికగా తన హెల్త్ అప్డేట్ ఇచ్చారు.
నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ- 'నా లైఫ్ అప్‌డేట్‌ను మీతో పంచుకుంటున్నాను. దురదృష్టవశాత్తు నా కుడి చేతికి మల్టిపుల్ ఫ్రాక్చర్ అయ్యింది. అలాగే నా కాలికి కూడా గాయమైంది. ఇది నాకు క్లిష్టమైన సమయం. ప్రస్తుతం ఈ నొప్పి భరించలేనంతగా ఉంది. ఈ గాయం వల్ల వేగంగా నా సినిమాలను షూట్ చేసి మీ ముందుకు తీసుకురాలేను. కోలుకోవడం చాలా నెమ్మదిగా ఉంది. అలాగే ఎంతో కష్టంగా ఉంది. కానీ, నేను పూర్తిగా కోలుకునేలా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. కాబట్టి నేను నా ఎనర్జిటిక్ బెస్ట్ మీకు అందించగలను. మునుపెన్నడూ లేనంత బలంగా, ఆరోగ్యంగా తిరిగి రావాలని బలంగా నిర్ణయించుకున్నాను.