Natu Natu Song Oscar Stage 2024:96వ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ అవార్డుల వేడుకకు ప్రపంచంలోని వివిధ దేశాల నటీనటులు, సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఆయా కేటగిరీల్లో పలు హాలీవుడ్ సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు. అయితే గతేడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు అందుకున్న 'నాటు నాటు' పాట తాజాగా మరోసారి అస్కార్ వేదికపై సందడి చేసింది.
ఈ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?' (What Was I Made For?)పాటకు అవార్డు దక్కింది. ఈ అవార్డు ప్రజెంటేషన్ సమయంలో స్టేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో 'నాటు నాటు' పాటతో పాటు విజువల్స్ ప్లే చేశారు. ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ సినిమా అధికారిక ట్విట్టర్ పేజ్‌లో షేర్ చేసింది. దీంతో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ వేదికపై మరోసారి తెలుగు పాట మార్మోగిపోవడం పట్ల టాలీవుడ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా కోసం రిస్క్ చేస్తూ స్టంట్స్ చేసే మాస్టర్ల కోసం కూడా ఓ వీడియో ప్లే చేశారు. హాలీవుడ్ సినిమాల్లోని కొన్ని స్టంట్ సీన్స్ ప్లే చేశారు. అయితే అందులో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఓ ఫైట్ సీన్ ఉంది.