తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

న‌ర‌కాసురిడిని వధించేందుకు నాని రెడీ - పవర్​ఫుల్​గా 'సరిపోదా శనివారం' టీజర్ - Saripodhaa Sanivaaram Teaser

Nani Sj Suryah Saripodhaa Sanivaaram Teaser Glimpse : నాని హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'స‌రిపోదా శ‌నివారం'. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌కుడు. ఎస్‌.జె.సూర్య ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నారు. నేడు సూర్య పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్​ను రిలీజ్ చేసింది మూవీటీమ్.

source ETV Bharat
Nani Sj Suryah Saripodhaa Sanivaaram Teaser (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 12:05 PM IST

Nani Sj Suryah Saripodhaa Sanivaaram Teaser Glimpse : నాని హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'స‌రిపోదా శ‌నివారం'. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌కుడు. ఎస్‌.జె.సూర్య ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నారు. నేడు సూర్య పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్​ను రిలీజ్ చేసింది మూవీటీమ్. ఇట్స్​ నాట్​ ఏ టీజర్ పేరుతో విడుదలైన ఈ ప్రచార చిత్రం నిమిషం 20 సెక‌న్ల పాటు సాగింది. ఇందులోనే క‌థను, పాత్ర‌ల్ని క్తుప్తంగా ప‌రిచ‌యం చేశారు దర్శకుడు. ఆగస్ట్ 29న థియేటర్లలో రియల్ గేమ్​ స్టార్ట్​ అవ్వక ముందే ఈ మాస్​ మ్యాడ్​నెస్​ టచ్​ను ఎక్స్​పీరియన్స్​ చేయండి అంటూ మేకర్స్​ చెప్పుకొచ్చారు.

"అప్పట్లో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ప్రజల్ని బాగా హింసించేవాడు" అంటూ పోలీస్ పాత్రలో ఉన్న ఎస్​ జే సూర్యను ఉద్దేశిస్తూ సన్నివేశాల్ని చూపించారు. "అందుకే శ్రీ‌కృష్ణుడు, స‌త్య‌భామతో క‌లిసి న‌ర‌కాసుడిని వ‌ధించారు" అంటూ నాని చెప్పే డైలాగ్​తో యాక్షన్ విజువల్ ట్రీట్ ఇచ్చారు. ఫైనల్​గా నాని 'హ్యాపీ బర్త్​డే సార్' అని చెప్పగా ఎస్ సూర్య నవ్వూతూ కిందకి పడిపోవడం చూపించారు. అంటే సూర్య సినిమాలో ఓ క్రూర‌మైన పోలీస్‌ ఆఫీసర్​. త‌న అరాచ‌కాల్ని హీరో(నాని) హీరోయిన్​తో కలిసి ఎలా ఎదిరించాడ‌న్న‌ది సినిమా కాన్సెప్ట్. సూర్య‌- నాని మ‌ధ్య సాగే పోరు ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలువనుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన ప్ర‌మోష‌న్ కంటెంట్ సినిమాపై ఉన్న ఆస‌క్తిని మ‌రింత పెంచింది. మొత్తంగా ప్రస్తుత టీజ‌ర్ చూస్తుంటే యాక్ష‌న్​కు పెద్ద పీట వేసిన‌ట్టు అర్థం అవుతోంది. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎన‌ర్జిటిక్‌గా సాగింది. ఆర్​ఆర్​ఆర్ నిర్మాత డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ 29న తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఆ మధ్య మూవీటీమ్ తెలిపింది. ఇకపోతే ఈ చిత్రానికి సంగీతం : జేక్స్‌ బిజోయ్‌, ఛాయాగ్రహణం : మురళి.జి, కూర్పు : కార్తీక శ్రీనివాస్‌, పోరాటాలు : రామ్‌ లక్ష్మణ్‌ అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details