తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఓటీటీలోకి నాని బ్లాక్​బస్టర్ మూవీ - 'సరిపోదా శనివారం' స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే! - Nani Saripodhaa Sanivaaram OTT - NANI SARIPODHAA SANIVAARAM OTT

Nani Saripodhaa Sanivaaram OTT : నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ హిట్ మూవీ 'సరిపోదా శనివారం' చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎక్కడ స్ట్రీమ్​ అవ్వనుందంటే?

Nani Saripodhaa Sanivaaram OTT
Nani Saripodhaa Sanivaaram OTT (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 1:27 PM IST

Nani Saripodhaa Sanivaaram OTT :నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. ఇటీవలె థియేటర్​లో విడుదలై మంచి టాక్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 26 నుంచి స్ట్రీమింగ్​కు అందుబాటులోకి రానుంది.

కథేంటంటే :
సూర్య (నాని)కి చిన్నప్పట్నుంచీ చాలా కోపం ఎక్కువ. దాన్ని వల్ల అతడు చాలా ఇబ్బందుల్లో పడుతుంటాడు. అందుకనే వాళ్ల అమ్మ ఛాయాదేవి (అభిరామి) సూర్య కోపాన్ని అదుపులో పెట్టడం కోసం తను చనిపోతూ ఓ మాట తీసుకుంటుంది. అప్పట్నుంచి అతడు వారమంతా ఎంత కోపం వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకుని, శనివారం మాత్రమే తన కోపానికి కారణమైన వాళ్లపై రివెంజ్ తీసుకుంటుంటాడు. వారమంతా చిత్ర గుప్తుడులా చిట్టా రాసుకుంటూ, శనివారం మాత్రం యముడిలా చెలరేగిపోతాడన్న మాట.

ఇలా చేస్తున్నందున ఆ గొడవలన్నీ కాస్త కొన్ని సార్లు ఇంటి వరకూ వస్తుంటాయి. దీంతో తండ్రి (సాయికుమార్), అక్క (అదితి) చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే అనుకోకుండా ఓ సారి ఎన్.ఎల్.ఐ.సిలో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్న సూర్య చిట్టాలోకి సీఐ దయానంద్ (ఎస్.జె.సూర్య) పేరు చేరుతుంది. తన సోదరుడు కూర్మానంద్ (మురళీశర్మ)తో దయాకు ఉన్న వైరం ఏంటి? అతడికీ, సోకులపాలెం అనే ఊరికీ ఉన్న సంబంధమేంటి? దయానంద్‌పై సూర్యకు ఉన్న కోపం, సోకులపాలేనికి ఏ రకంగా మేలు చేసింది? వీళ్ల స్టోరీలోకి చారులత (ప్రియాంక మోహన్) ఎలా ఎంట్రీ ఇచ్చిందనేదే మిగతా కథ!

నానితో పాటు మిగతా నటీనటులందరూ తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. నాని మాస్ యాక్షన్​కు తోడు ఎస్​జే సూర్య వెర్సటైలిటీ అభిమానులను అలరిస్తుంది. ఇక శుభలేఖ సుధాకర్​, హర్షవర్ధన్​, సాయి కుమార్, అభిరామి లాంటి స్టార్స్ తమ పాత్రకు తగ్గట్లుగా నటించి మెప్పించారు. ఫైట్స్​, ఎమోషన్స్, కామెడీ ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు.

రూ. 100కోట్ల క్లబ్​లోకి 'సరిపోదా శనివారం' - 'ఇప్పుడు సరిపోయిందట'! - Saripodhaa Sanivaaram Collection

15రోజులు మాకు నిద్ర లేదు: సక్సెస్​మీట్​లో నాని - Saripodhaa Sanivaaram

ABOUT THE AUTHOR

...view details