Nani Hit 3 Teaser : నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా 'హిట్ 3: ది థర్డ్ కేస్'. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2025 మే 1న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సోమవారం టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
భారీ రెస్పాన్స్‌తో యూట్యూబ్‌లో రికార్డులు బద్దలుకొడుతోంది. రిలీజైన 24 గంటల్లోపే 17+ మిలియన్ వ్యూస్‌తో టీజర్ దూసుకుపోతోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, నాని లుక్స్ ఫుల్‌గా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హీరో నాని, విజయ్ దేవరకొండ రికార్డును బీట్ చేశారు. రీసెంట్గా రిలీజైన విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' టీజర్ వ్యూస్‌ను 'హిట్ 3' ఈజీగా దాటేసింది.
ఒక్కరోజులోనే
విజయ్ దేవరకొండ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా 'కింగ్డమ్'. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. మే 30న ఇది థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12న మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ కొత్త పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ టీజర్‌కు 12రోజుల్లో కలిపి 15+ మిలియన్ వ్యూస్ రాగా, సోమవారం విడుదలైన నాని 'హిట్ 3'కు ఒక్కరోజు కూడా పూర్తి అవ్వకముందే 17+ మిలియన్ వ్యూస్ దక్కాయి. అంటే విజయ్ 'కింగ్డమ్' 12 రోజుల పూర్తి వ్యూస్‌ను, నాని 'హిట్ 3'తో 24గంటల్లోపే బ్రేక్ చేశారు.