Namrata Shirodkar Birthday Party:టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు సతీమణి, నటి నమ్రత శిరోద్కర్ జనవరి 22న తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభిమానులతో సహా పలువురు ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలిపారు. నమ్రత తన బర్త్‌డేను సన్నిహితులు, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఎంతో స్పెషల్‌గా జరుపుకున్నారు. వీరిందరి కోసం గ్రాండ్‌గా ఓ పార్టీని కూడా అరేంజ్ చేశారు. అయితే ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను నమ్రత ఈరోజు (జనవరి 24) సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పార్టీకి బ్రాహ్మణి, బన్నీ భార్య
ఈ పార్టీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డితో పాటు నారా లోకేశ్ భార్య, హీరో నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి కూడా హాజరయి సందడి చేశారు. వీరితో పాటు మరికొందరు దగ్గరి బంధువులు కూడా బర్త్‌డే పార్టీకి అటెండ్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను నమ్రత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. మహేశ్ తనయ సితారతో పాటు కుమారుడు గౌతమ్ ఈ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వారిద్దరూ నమత్రతో కలిసి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత పార్టీకి వచ్చిన గెస్ట్స్ అందరూ బర్త్‌డే గర్ల్ నమ్రతతో కలిసి ఫొటోలు దిగారు.
మహేశ్ స్పెషల్ గ్రీటింగ్స్
జనవరి 22న జరిగిన నమ్రత పుట్టినరోజుకు భర్త మహేశ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పెషల్ గ్రీటింగ్స్ పంపారు. ప్రస్తుతం ఫ్యామిలీతో అందుబాటులో లేని మహేశ్ నమ్రతకు పుట్టిరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్‌డే ఎన్ఎస్జీ- ప్రేమ, ఐక్యతతో నిండిన మరో ఏడాదికి కృతజ్ఞతలు. నా ప్రతిరోజును బెటర్‌గా మలిచినందుకు ధన్యవాదాలు' అంటూ ఇంగ్లిష్‌లో తన బర్త్‌డే విషెస్‌ను క్యూట్‌గా తెలియజేశారు. ఇందుకు రిప్లైగా నమ్రత- 'థ్యాంక్యూ ఎంబీ మిస్సింగ్ ఎట్ యూ హోమ్' అంటూ బదులిచ్చారు.