తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కల్కి' ఫస్ట్ రివ్యూ - టాక్​ ఎలా ఉందంటే? - Kalki 2898AD First Review - KALKI 2898AD FIRST REVIEW

Nagashwin Prabhas Kalki 2898AD First Review : కల్కి ఫస్ట్ రివ్యూ సంబంధించి సోషల్​ మీడియాలో ట్వీట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?

source ETV Bharat
Prabhas Kalki (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 9:00 AM IST

Nagashwin Prabhas Kalki 2898AD First Review :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సెన్సార్ పూర్తైంది. అందరూ ఊహించినట్లే యూ/ఏ సర్టిఫికెట్​ను అందుకుంది. రన్​టైమ్​ 2 గంటల 55 నిమిషాలు. అంటే 175 నిమిషాలు(Kalki 2898 AD Censor Run time). సినిమాలో ఊహించని రేంజ్​లో ట్విస్ట్​లు, సస్పెన్స్​లు ఉన్నాయట. భైరవ పాత్రలో ప్రభాస్ అదరగొట్టారట. నాగ్​ అశ్విన్​ మాత్రమే ఇలాంటి విజన్​తో సినిమా చేయగలరని అంటున్నారు. మరో బ్లాక్​ బస్టర్ లోడింగ్ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ రివ్యూ బయటకొచ్చినప్పటి నుంచి సినిమాపై మరింత హైప్​ పెరిగిపోయింది. ఫ్యాన్స్ ఈ రివ్యూను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా కోసం ఐ యామ్ వెయిటింగ్ అంటూ విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.

Kalki Advance Bookings : కాగా, కల్కి సినిమాను పాన్ వరల్డ్ అంటూ మేకర్స్ మొదటి నుంచే బజ్ క్రియేట్ చేశారు. అయినా మొదట సినిమాపై అంతగా హైప్ రాలేదు. ఆ తర్వాత క్రమక్రమంగా విడుదలైన పోస్టర్స్​, గ్లింప్స్​, ట్రైలర్​తో భారీ హైప్ క్రియేట్ అయింది. బుజ్జి అండ్ భైరవ ఎపిసోడ్స్​, రిలీజైన ఒక నేనే. నాకు చుట్టూ నేనే సాంగ్​ బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్​లో బుకింగ్స్​ కూడా ఓపెన్ అయి హాట్​ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్‌ రెండు మిలియన్ల డాలర్లకు పైగా మార్క్​ను టచ్ చేసిందట. దీంతో ప్రీ సేల్స్ విషయంలో రికార్డులు నమోదవుతున్నాయి.

ఇకపోతే ఈ చిత్రాన్ని సైన్స్​కు మైథాలజీని జోడించి తెరకెక్కించారు. ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే కథతో ఇది సాగుతుంది. వైజయంతీ మూవీస్‌ బ్యానర్​పై నిర్మాత అశ్వినీ దత్​ నిర్మించారు. మహానటి ఫేమ్ నాగ్​ అశ్విన్ డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్​ కమల్​ హాసన్​, బోల్డ్ బ్యూటీస్​ దిశా పటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.

'కథ రాయడానికి ఐదేళ్లు పట్టింది - కలిపురుషుడిని అలా చూపించాలనుకున్నా' - Kalki 2898 AD Movie

'పుష్ప 2' వాయిదాతో పెరిగిన బడ్జెట్ భారం - ఎన్ని కోట్లంటే?

ABOUT THE AUTHOR

...view details