Naga Chaitanya Sobhita Dhulipala Wedding :అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వివాహ ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 4న ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. ఈ విషయాన్ని అక్కినేని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కాగా, 2024 ఆగస్టు 8న వీళ్ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కానీ, అప్పుడు పెళ్లిపై క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే ఏడాదిలో వివాహం ఉండవచ్చని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులే దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.
అప్పుడే హింట్
నటి శోభిత ఇంట్లో వారం కిందటే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా శోభిత షేర్ చేసుకున్నారు. 'గోధుమ రాయి పసుపు దంచడం, మొదలైపోయింది' అంటూ అందుకు సంబంధించిన ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆమె స్వయంగా పసుపు దంచుతున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. దీంతో త్వరలోనే వీరి పెళ్లి ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. అనుకున్నట్లు గానే పెళ్లి తేదీ చెప్పేశారు. మరో నెల రోజుల్లోనే వీళ్ల పెళ్లి జరగనుంది. అటు అక్కినేని వారి ఇంట్లో కూడా త్వరలోనే పెళ్లి పనులు ప్రారంభం కానున్నాయి. కానీ, వివాహ వేడుక ఎక్కడ అనేది తెలియాల్సి ఉంది.
స్పెషల్ అట్రాక్షన్
కాగా, రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ANR జాతీయ అవార్డులు పురస్కారానికి శోభిత దూళిపాళ్ల హాజరయ్యారు. గ్రీన్ శారీ ధరించి క్లాసీ లుక్‌తో కనిపించారు. ఆమె అక్కినేని కుటుంబ సభ్యులతో కలిసి అవార్డ్స్ వేడుకలో సందడి చేశారు. చై, శోభిత జంట ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇదే ఈవెంట్లో అక్కినేని నాగార్జున తనకు కాబోయే కోడలిని మెగాస్టార్ చిరంజీవికి పరిచయం చేశారు. ఆమె చిరంజీవిని ఆప్యాయంగా పలకరించారు.