తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నాగ చైతన్య - శోభిత పెళ్లి పనులు ప్రారంభం - NAGA CHAITANYA SOBHITA MARRIAGE

అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు మొదలు - పసుపు దంచుతున్న ఫొటోలను పోస్ట్ చేసిన శోభిత!

Naga Chaitanya Sobhita Dhulipala Marriage
Naga Chaitanya Sobhita Dhulipala Marriage (source Nagarjuna X twitter)

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2024, 2:01 PM IST

Naga Chaitanya Sobhita Dhulipala Marriage : అక్కినేని నాగచైతన్య- నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. నటి శోభిత ఇంట్లో అప్పుడే పెళ్లి సందడి షురూ అయ్యింది. ఈ మేరకు ఆమె ఫొటోలను తన ఇన్‌స్టా గ్రామ్​లో షేర్‌ చేశారు. 'గోధుమ రాయి పసుపు దంచడం, మొదలైపోయింది' అంటూ పోస్ట్​సు క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆమె స్వయంగా పసుపు దంచుతున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో శోభితా సంప్రదాయంగా కనిపించారు. ఎరుపు రంగు, గోధుమ వర్ణం పట్టు చీరలో శోభిత మెరిసిపోతూ కనిపించారు. ఈ పోస్ట్​ చూసిన ఫ్యాన్స్ పెళ్లి ఎప్పుడో చెప్పాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్​గా మారాయి.

కాగా, నాగచైతన్య తనకు కాబోయే భార్య, నటి శోభితతో కలిసి దిగిన ఓ ఫొటోను రీసెంట్​గా సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఇద్దరూ కలిసి ఓ లిఫ్ట్‌లో దిగిన ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​లో పోస్ట్‌ చేశారు. ఈ పిక్‌ శోభిత తీసినట్లు స్పష్టమవుతోంది. నాగ చైతన్య లిఫ్ట్‌లోని మిర్రర్‌ వైపు చూస్తూ ఫొటోకి పోజు ఇస్తున్నారు. శోభిత మిర్రర్​లో కనిపించే ఇద్దరి ప్రతిబింబాలను క్యాప్చర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రెండీ ఔట్​ఫిట్​లో ఉన్న ఈ ఫొటో కూడా నిమిషాల్లో వైరల్​గా మారింది. ఈ పోస్టుకు లక్షల్లో లైకులు కూడా వచ్చాయి. కాగా చై- శోభిత నిశ్చితార్థం 2024 ఆగస్టు 8న జరిగింది. కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

ఇక చైతన్య- శోభితా చాలా కాలంగా మంచి స్నేహితులు. శోభితా 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. 2016లో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 'గూఢచారి'తో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. 'మేజర్‌', 'పొన్నియిన్‌ సెల్వన్‌', 'మంకీ మ్యాన్‌' వంటి సినిమాల్లో యాక్ట్‌ చేసింది.

మరోవైపు నాగచైతన్య 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రం బ్యాక్​డ్రాప్​లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మూవీతో చైతూకు జోడీగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్​గా నటిస్తోంది.

శోభితతో చైతూ క్రేజీ సెల్ఫీ- ఇన్​స్టా పోస్ట్ వైరల్

'సమంత నా సోల్​మేట్- అలా చూసేసరికి కళ్లలో నీళ్లు తిరిగాయి' - Sobhita Dhulipala

ABOUT THE AUTHOR

...view details