ETV Bharat / bharat

నెలరోజులుగా ఫోన్ల వాడకం పూర్తిగా బంద్​ - ఐఫోన్​పైనా ఆ ఫ్యామిలీకి డౌట్లు - ఇదీ కారణం! - BHOPAL YOUTH TRAPPED BY HACKERS

3 ఫోన్లు మార్చినా, కుటుంబాన్ని వేరే ఊరికి పంపించినా నో యూజ్​ - భోపాల్​లోని ఓ ఫ్యామిలీకి హ్యాకర్స్​ నుంచి తీవ్ర వేధింపులు!

Bhopal Youth Trapped By Hackers
Bhopal Youth Trapped By Hackers (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2025, 11:56 AM IST

Bhopal Youth Trapped By Hackers : ప్రస్తుత కాలంలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్​లోని భోపాల్​లోని ఓ కుటుంబానికి ఎదురైంది. హ్యాకర్ల దెబ్బకు ఆ కుటుంబం మొత్తం గత నెల రోజులుగా ఫోన్స్​ వాడటం మానేసింది. అసలు ఆ కుటుంబాన్ని హ్యాకర్లు ఎలా ఇబ్బంది పెట్టారు? వారు పడిన ఇబ్బందులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

'దయచేసి నన్ను కాపాడండి'
'ఎవరైనా దయచేసి నన్ను హ్యాకర్ల నుంచి కాపాడండి' భోపాల్​కు చెందిన అనిల్ కుమార్ అనే ఓ యువకుడు చేసిన విజ్ఞప్తి ఇది. హ్యాకర్లతో విసిగిపోయిన అతడు గత రెండు నెలల్లో మూడు మొబైల్ ఫోన్లు, సిమ్, ఈ-మెయిల్ ఐడీలను మార్చాడు. అయినప్పటికీ హ్యాకర్లు నుంచి వేధింపులు తప్పలేదు.

ఐఫోన్ తీసుకున్నా తప్పని దాడి!
ఆఖరికి సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకునేందుకు స్నేహితుడి పేరిట ఐఫోన్ తీసుకున్నాడు. అయినప్పటికీ అనిల్​కు సైబర్ కేటుగాళ్ల నుంచి వేధింపులు తప్పలేదు. దీంతో అనిల్ కుమార్ కుటుంబం మొత్తం గత నెల రోజులుగా తమ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు.

దీపావళి నుంచి వేధింపులు
"నేను భోపాల్​లోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఏరియా మేనేజర్​గా పనిచేస్తున్నాను. దీపావళి నుంచి హ్యాకర్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఓ రోజు నేను కారులో మా ఫ్యామిలీతో కలిసి వెళ్తుంటే నా మొబైల్​కి ఒక కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది. నేను కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాను. అయినప్పటికీ ఇలాంటి మెసేజ్​లు మళ్లీ వచ్చాయి. నా నంబర్‌ నుంచి ఇరుగు పొరుగువారికి, బంధువులకు, నేను పనిచేసే సంస్థ అధికారులకు అసభ్యకరమైన మెసేజ్​లను హ్యాకర్లు పంపించారు. ఆ మెసేజ్​లు నేను పంపలేదని అందరికి చెప్పాను. అప్పుడే హ్యాకర్లు నా ఫోన్​లోని నంబర్లు, మొబైల్ డేటాను హ్యాక్ చేశారని గ్రహించాను" అని అనిల్ కుమార్ తెలిపారు.

ఫేస్​బుక్​లో అసభ్యకర ఫొటోలు
"ఫోన్ నంబర్లను డిలీట్ చేసి ఒకరోజు ప్రశాంతంగా ఉన్నాం. మరుసటి రోజు ఫేస్​బుక్​లో నా, నా భార్యాపిల్లల అసభ్యకరమైన చిత్రాలు పోస్ట్ అయ్యాయి. దీంతో వెంటనే జిల్లా సైబర్ సెల్​ను ఆశ్రయించాం. సైబర్ నిపుణుల సహాయంతో మా సమస్య తీరిపోయిందనుకున్నాం. కానీ కొన్ని గంటలు తర్వాత మళ్లీ మొబైల్ హ్యాక్ అయ్యింది. నా నంబరు మీద ఇతరులకు మెసేజ్​లు వెళ్లాయి. నిరాశతో మళ్లీ సైబర్ సెల్​కి చేరుకున్నాం. పోలీసులు మా మొబైల్స్​ను తీసుకుని, వారి అధీనంలో ఉంచారు. సైబర్ దాడిని తప్పించుకునేందుకు స్నేహితుడి ఐడీతో ఐఫోన్ కొన్నాను. అందులో కొత్త ఈ-మెయిల్ ఖాతా, కొత్త సిమ్ వేశాను. దీనితో అతడికి కూడా అభ్యంతరకర మెసేజ్​లను హ్యాకర్లు పంపారు" అని అనిల్ వాపోయాడు.

'మా దగ్గర నిల్చొడానికే భయపడుతున్నారు'
ఇరుగుపొరుగువారు, స్నేహితులు తమ కుటుంబం దగ్గర నిలబడడానికే భయపడుతున్నారని అనిల్ కుమార్ తెలిపారు. తన భార్యను పుట్టింటికి పంపానని చెప్పుకొచ్చారు. నేను ఎవరితో సన్నిహితంగా ఉంటే వారి మొబైల్​కు అసభ్యకరమైన మెసేజ్​లను హ్యాకర్ పంపుతున్నారని వాపోయారు. హ్యాకర్ దెబ్బకి ప్రస్తుతం వాట్సాప్ కూడా వాడటం మానేశానని తెలిపారు.

గత నెలరోజుగా తన ఫ్యామిలీ ఫోన్​ను వాడటం లేదని బాధితుడు పేర్కొన్నారు. మొబైల్ లేకపోవడం వల్ల ఉద్యోగానికి ఇబ్బంది కలుగుతోందని, అయినా తప్పట్లేదని అనిల్ అన్నారు. అయితే బాధితుడి మొబైల్ ఫ్యాక్టరీ రీసెట్ చేసి, ఆయనకు తిరిగి ఇచ్చామని భోపాల్ సైబర్ సెల్ ఎస్ఐ ప్రమోద్ శర్మ తెలిపారు. అయినప్పటికీ అనిల్ మొబైల్​ను హ్యాక్ చేశారంటూ ఫిర్యాదు వచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును రాష్ట్ర సైబర్ సెల్​కు బదిలీ చేశామని పోలీసులు వెల్లడించారు.

లేడీ రైడర్ సోలో సాహసం- బైక్​పై 371 రోజుల్లో 64 దేశాల టూర్- అందుకేనట ఈ అడ్వెంచర్!

పెంపుడు తేనెటీగలు - 12ఏళ్లుగా కన్నబిడ్డల్లా చూసుకుంటున్న వ్యక్తి! ఆ ఫ్యామిలీలో ఎవరినీ కుట్టవు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.