Naga Chaitanya Sobhita Dhulipala Love Story :టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఈ కొత్త జంట ఓ ఆంగ్ల మీడియాకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో వారి పరిచయం, అలాగే ప్రేమ గురించి ఈ కొత్త జంట మాట్లాడారు. మొదటిసారి 2018లో నాగార్జున ఇంటికి వెళ్లినట్లుగా శోభిత తెలుపగా, 2022 ఏప్రిల్ తర్వాత చైతూతో తన స్నేహం మొదలైనట్లు చెప్పుకొచ్చారు. ఇలాంటి పలు ఆసక్తికరమైన విషయాలు వారి మాటల్లోనే :
అలా మా బంధం మెరుగైంది
శోభిత : 2022 ఏప్రిల్ నుంచి నేను చైతూను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను, తను ఎప్పుడు కలిసినా సరే ఫుడ్ గురించే మాట్లాడుకునేవాళ్లం. నన్ను తరచూ తెలుగులో మాట్లాడమని చైతన్య అడిగేవారు. అలా మాట్లాడటం వల్లనే మా బంధం ఇంకాస్త బలపడింది. నేను ఎప్పుడూ ఇన్‌స్టాలో యాక్టివ్‌గానే ఉంటాను. అయితే నేను పెట్టే గ్లామర్ ఫొటోలకు కాకుండా ఇన్స్పిరేషనల్ స్టోరీలరు అలాగే నా ఒపీనియన్స్కు సంబంధించిన పోస్ట్‌లను చైతూ లైక్ కొట్టేవారు.
అక్కడే మా ఫస్ట్ మీట్
శోభిత :ముంబయిలోని ఓ కేఫ్‌లో ఫస్ట్ టైమ్ చైతూను కలిశాను. "అప్పుడు చైతన్య హైదరాబాద్, నేను ముంబయిలో ఉండేవాళ్లం. అయితే తను నాకోసం హైదరాబాద్ నుంచి ముంబయి వచ్చేవారు. ఫస్ట్ టైమ్ మేమిద్దరం బయటకు వెళ్లినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్‌లో ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లాం. అక్కడ కాసేపు టైమ్ స్పెండ్ చేశాం. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్‌కు సంబంధించిన ఈవెంట్‌కు వెళ్లాం. అప్పటినుంచి జరిగినదంతా మీకందరికీ తెలిసిన విషయమే" అని నటి గుర్తుచేసుకున్నారు.