NagaChaitanya Sobhita Dhulipala Engazement : సీక్రెట్‌గా రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేసిన లవ్ బర్డ్స్ నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నారు. తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. వాళ్ల ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోలను కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ జంట నిశ్చితార్థం గురించి నాగార్జున చెబుతూ తేదీని 8.8.8 గా చెప్పారు. దీంతో చాలా మందికి దీని అర్థం ఏంటో తెలియలేదు. మరి ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం గురించి నాగార్జున ఇలా పోస్ట్ చేశారు. "నా కొడుకు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ ఉదయం 9:42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. శోభితను మా ఫ్యామిలీలోకి ఆహ్వానించడం చాలా సంతోంగా ఉంది. 8.8.8. అనంతమైన ప్రేమకు ఇది ఆరంభం" అని రాసుకొచ్చారు.
నేడు తేదీ ఆగస్టు 8, 2024. అంటే 8-8-2024. కానీ నాగ్ మాత్రం 8.8.8. అని రాసుకొచ్చారు. 2024 కలిపితే 8 సంఖ్య వస్తుంది. అందుకే ఆయనలా చెప్పారు. ఈ 8.8.8కు ఓ ప్రత్యేకత ఉంది. జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ రోజుకు ఓ ప్రాముఖ్యత ఉంది.
అదేంటంటే ఈ రోజు లయన్స్ గేట్ పోర్టల్ అంటారు. ఈ రోజు శుభకార్యాలకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందట.