తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

శోభితతో చైతూ క్రేజీ సెల్ఫీ- ఇన్​స్టా పోస్ట్ వైరల్ - NAGA CHAITANYA SHOBHITA DHULIPALA

అక్కినేని నాగచైతన్య- శోభితా ధూళిపాళ్లతో తొలిసారి ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Naga Chaitanya Shobhita
Naga Chaitanya Shobhita (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2024, 7:42 PM IST

Naga Chaitanya Shobhita Dhulipala :యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తనకు కాబోయే భార్య, నటి శోభితా ధూళిపాళ్లతో కలిసి దిగిన ఫొటోను తొలిసారిగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇద్దరూ కలిసి ఓ లిఫ్ట్‌లో దిగిన ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​లో పోస్ట్‌ చేశారు. ఈ పిక్‌ శోభిత తీసినట్లు స్పష్టమవుతోంది. నాగ చైతన్య లిఫ్ట్‌లోని మిర్రర్‌ వైపు చూస్తూ ఫొటోకి పోజు ఇస్తున్నారు. శోభిత మిర్రర్​లో కనిపించే ఇద్దరి ప్రతిబింబాలను క్యాప్చర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ జంట ఫొటోలో ట్రెండీగా కనిపిస్తోంది. ఇద్దరూ స్టైలిష్ కళ్లద్దాలు ధరించి బ్లాక్ ఔట్​ఫిట్​లో ఉన్నారు. చూస్తుంటే ఎక్కడికో షాపింగ్​కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక 'Everything everywhere all at once' అని క్యాప్షన్ రాసుకొచ్చారు. చైతూ పోస్ట్‌ చేసిన వెంటనే ఫొటో వైరల్‌గా మారింది. గంటలో ఈ పోస్ట్​కు లక్షకుపైగా లైక్‌లు వచ్చాయి.

త్వరలోనే పెళ్లి
కాగా, నాగ చైతన్య- శోభితా నిశ్చితార్థం 2024 ఆగస్టులో హైదరాబాద్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ వేడుక ఫొటోలను చైతూ ఫాదర్ కింగ్​ నాగార్జున సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. పోస్టులో 'నా తనయుడు నాగ చైతన్య, శోభితా నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా 8.8.8 (08-08-2024) అనంతమైన ప్రేమకు నాంది' అని తెలిపారు. ఇక వచ్చే ఏడాది మార్చిలో వీరి పెళ్లి జరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

చైతన్య- శోభితా చాలా కాలంగా మంచి స్నేహితులు. శోభితా 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. 2016లో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 'గూఢచారి'తో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. 'మేజర్‌', 'పొన్నియిన్‌ సెల్వన్‌', 'మంకీ మ్యాన్‌' వంటి సినిమాల్లో యాక్ట్‌ చేసింది.

మరోవైపు నాగచైతన్య 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రం బ్యాక్​డ్రాప్​లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మూవీతో చైతూకు జోడీగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్​గా నటిస్తోంది.

'సమంత నా సోల్​మేట్- అలా చూసేసరికి కళ్లలో నీళ్లు తిరిగాయి' - Sobhita Dhulipala

నాగచైతన్య- శోభిత పెళ్లి ఎప్పుడు? నాగార్జున రిప్లై ఇదే! - Naga Chaitanya Sobhita

ABOUT THE AUTHOR

...view details