తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వీఎఫ్​ఎక్స్ కోసమే రూ.30 కోట్లు! - చైతూ కొత్త సినిమా బడ్జెట్​ ఎంతో తెలుసా? - NAGA CHAITANYA KARTHIK DANDU MOVIE

నాగ చైతన్య సినిమా కోసం షాకింగ్ బడ్జెట్ - వీఎఫ్​ఎక్స్ కోసమే రూ. 30 కోట్లు!

Naga Chaitanya Karthik Dandu Movie Bugdet
Naga Chaitanya (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 10:05 AM IST

Naga Chaitanya Karthik Dandu Movie Bugdet :టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం 'తండేల్' సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. సాయి పల్లవి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందే చై అప్​కమింగ్ మూవీ గురించి ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్​లో రానున్న ఆ చిత్రానికి ఏకంగా రూ.110 కోట్ల మేర బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్​ కోసమే సుమారు రూ.30 కోట్లను వెచ్చించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమా గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్​మెంట్ రానున్నట్లు సమాచారం.

ఆ హీరోయిన్​తో రెండోసారి
ఇదిలా ఉండగా, ఈ సినిమాలోని ఫీమేల్ లీడ్​ కోసం ఓ స్టార్ హీరోయిన్​ను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. ఆమెవరో కాదు బుట్టబొమ్మ పూజా హెగ్డే. గతంలో ఈ కాంబోలో ఒక లైలా కోసం అనే సినిమా వచ్చి మంచి టాక్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ జోడీ మళ్లీ సిల్వర్​ స్క్రీన్​పై మెరవడం ఆనందం కలిగిస్తోందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Pooja Hegde Upcoming Movies : కాగా, పూజా హెగ్డేకు గత మూడేళ్లుగా సరైన హిట్ పడలేదు. 'రాధే శ్యామ్'​తో మొదలై 'బీస్ట్'​, 'ఆచార్య', 'సర్కస్'​, 'కిసీ కా భాయ్​ కిసీ కీ జాన్'​ ఇలా అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూశాయి. దీంతో ఈమె గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈ మధ్యే మళ్లీ పూజాకు ఆఫర్లు వెల్లువ మొదలైంది. 'దేవా', 'సూర్య 44', 'దళపతి 69' లాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో ఛాన్స్​లను అందుకుంది. ఇక తెలుగులో చైతూతో ప్రాజెక్ట్​ ఓకే అయితే 'ఆచార్య' తర్వాత ఇదే ఆమె తెలుగు సినిమా అవుతుందని సినీ వర్గాల మాట.

ఇక నాగ చైతన్య విషయానికొస్తే ఆయన కూడా గత కొద్ది కాలంగా విజయాన్ని చూడలేదు. ఆ మధ్య ఓటీటీలో వచ్చిన 'దూత'కు మంచి టాక్ రావడం వల్ల చై అభిమానులు కాస్త ఊరట చెందారు. ప్రస్తుతం ఆయన చందూ మొండేటితో కలిసి 'తండేల్' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంపైనే చైతూ ఆశలన్నీ పెట్టుకున్నారు.

అక్కినేని హీరోతో జాన్వీకపూర్​! - ఏ సినిమా కోసం అంటే?

రామ్​చరణ్​తో పోటీకి దిగనున్న నాగచైతన్య!

ABOUT THE AUTHOR

...view details