Naa Uchvasam Kavanam Prabhas : ఈటీవీలో ప్రసారమవుతోన్న 'నా ఉచ్ఛ్వాసం కవనం' కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి పార్ట్ 2 ప్రోమో రిలీజ్ అయింది.
ఇందులో డార్లింగ్ ప్రభాస్ మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు సెకండ్ ప్రోమోలో 'శివ' సినిమాలో బోటనీ పాఠముంది సాంగ్ గురించి మాట్లాడారు. ఆ పాటను రచయిత సీతారామశాస్త్రి రాశారని తెలిసి ఆశ్చర్యపోయినట్లు చెప్పుకొచ్చారు. తాను ఎక్కడకు వెళ్లినా ఆ పాట పాడే వాడినని గుర్తు చేసుకున్నారు. శ్రీశ్రీ గారు, సిరివెన్నెల గారు రాసినవి వింటుంటే ఒక రకమైన ఉద్వేగానికి గురవుతామని, బాడీలో బ్లడ్ బాయిల్ అవుతుందని ప్రభాస్ అన్నారు.
Sirivennela Sitaramasastri Prabhas : పార్ట్ 1లో సిరివెన్నెల సీతారామశాస్త్రి వల్లే సినీ సాహిత్యంపై తనకు ప్రేమ పుట్టిందని ప్రభాస్ అన్నారు. గతంలో తాను నటించిన 'వర్షం' సాంగ్స్‌తో అది మొదలైందని తెలిపారు. "నా తొలి సినిమా ఈశ్వర్‌లోని మొదటి పాట (అమీర్‌పేటకు)ను సిరి వెన్నెల రాశారు. అందులోని 'కొత్త వానలోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతుందిరా' లైన్ నాకు బాగా నచ్చింది. వర్షం సినిమాకు పని చేసే సమయంలో సీతారామశాస్త్రి వల్ల సాహిత్యంపై ప్రేమ కలిగింది. ఆ మూవీ సెట్స్‌లోనే తొలిసారి ఆయన్ను కలిశాను." అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.