Law Clerk Posts in Telangana High Court : తెలంగాణ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 33 లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టులో 31 ఖాళీలు ఉండగా, తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ, సికింద్రాబాద్లో 2 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టు లేదా తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ, సికింద్రాబాద్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థులు నవంబరు 23 సాయంత్రం 5 గంటల్లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు పేరు - ఖాళీలు
లా క్లర్క్ : మొత్తం 33 పోస్టులు
అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి : 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే విధానం : ఆఫ్లైన్లోనే దరఖాస్తులను ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 23-11-2024.
డిగ్రీ అర్హతతో స్థానిక అధికారి పోస్టులు - మొదటి నెల నుంచే రూ.77 వేల వేతనం