ETV Bharat / sports

ఐపీఎల్ రిటెన్షన్ షో కౌంట్​డౌన్ షురూ! - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

ఆసక్తికరంగా ఐపీఎల్ రిటెన్షన్ షో! - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

IPL 2025 Retention Announcement
IPL 2025 Retention Show (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

IPL 2025 Retention Show : మెగా వేలం కంటే ముందు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే అది రిటైన్షన్ ప్లేయర్స్ లిస్ట్ గురించే. ఇప్పటికే దీని గురించి పలు రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్ 31 నాటికల్లా ఆయా ఫ్రాంచైజీలు ఈ జాబితాను సబ్మిట్ చేయాలని మేనేజ్​మెంట్ ఆదేశించగా, ఇప్పుడు అఫీషియల్​గా ఈ టాపిక్ వెలుగులోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ రేపు (అక్టోబర్ 31) స్ట్రీమ్​ అవ్వనుంది. మరీ దీన్ని ఎక్కడ చూడొచ్చంటే?

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చంటే?
ఐపీఎల్ 2025 రిటెన్షన్​ లైవ్​ను ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ వేదికగా చూడొచ్చు. లేకుంటే జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లోనూ వీక్షించవచ్చు. సాయంత్రం 5 గంటలలోపు ప్రతి జట్టు తమ రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాను ఇవ్వాల్సి ఉండగా, దానికి అరగంట ముందే ఈ ఈవెంట్​ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇది కాకుండా స్టార్‌ టీమ్స్ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ తమ రిటైన్డ్ ప్లేయర్‌ల జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందట.

నవంబర్ చివరి వారంలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలానికి ముందే అన్నీ ఫ్రాంచైజీలు తమ జట్టులో ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి మేనేజ్​మెంట్ పర్మిషన్ ఇచ్చింది. అయితే రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, మహేంద్ర సింగ్ ధోనీ, కేఎల్ రాహుల్‌ లాంటి స్టార్ ప్లేయర్ల రిటెన్షన్ విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. రిటైన్ రూల్స్ ప్రకారం సాధారణంగా తొలి రిటైన్ ప్లేయర్​కు రూ. 18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రెండు, మూడు క్రమంలో రిటైన్ అయిన ప్లేయర్లకు వరుసగా రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాలని మేనేజ్​మెంట్ సూచించింది. అయితే నాలుగు, ఐదు స్థానాల్లో చేసుకునే ప్లేయర్లకూ వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్ కు రూ. 4 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.

ఐపీఎల్ నయా రూల్స్​కు బీసీసీఐ గ్రీన్​ సిగ్నల్ - రిటెన్షన్​లో ఆరుగురిని అట్టిపెట్టుకునే ఛాన్స్ - IPL 2025 Retention Rules

17 ఏళ్లలో 600 శాతం పెరిగిన ఐపీఎల్ ఫ్రాంచైజీల లిమిట్- తొలి సీజన్​లో ఎంతంటే? - IPL 2025 Purse Value

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.