ETV Bharat / spiritual

దీపావళి విశిష్టత ఏంటి? ఎందుకు జరుపుకోవాలి? ధనలక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి? - DIWALI 2024

మహా పర్వదినం దీపావళి - పురణాల ప్రకారం దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Diwali Puja Vidhi
Diwali Puja Vidhi (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 12:54 PM IST

Diwali Puja Vidhanam: ఐదు రోజుల పాటు జరిగే పండుగ సంబరాలలో మూడవ రోజు మహా పర్వదినం దీపావళి. అనగా దీపాల వరుస. ఈ రోజు వరుసగా దీపాలను వెలిగిస్తారనే ఈ పండుగకు దీపావళి అని పేరు వచ్చింది. ఈ మాట మనమందరం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కానీ అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటాం? ఈ ఆధునిక కాలంలో దీపావళి ఎలా జరుపుకుంటే మంచిది అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

నరకాసుర సంహారం జరిగినందుకే!
వేదవ్యాసుడు రచించిన వరాహ పురాణం ప్రకారం శ్రీ కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించిన మరుసటి రోజున దీపావళి పండుగ జరుపుకోవాలని తెలుస్తోంది. లోకానికి నరకుని పీడ విరగడైనందుకు అందరూ సంతోషంగా జరుపుకునే పండుగే దీపావళి.

అయోధ్యలో దీపావళి అందుకే!
వాల్మీకి రామాయణం ప్రకారం 14 సంవత్సరాలు అరణ్యవాసం తర్వాత లంకలో రావణుని సంహరించి, రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని తెలుస్తోంది.

నువ్వుల నూనెలో లక్ష్మీదేవి
ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు జరుపుకునే దీపావళి నాటి తెల్లవారుజామున నువ్వుల నూనెలో, సమస్త నదీ, తటాక, సముద్ర జలాల్లో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందంట. అందుకే ఈ రోజు తెల్లవారుఝామునే లేచి నువ్వుల నూనెతో తలంటుకుని తలారా స్నానం చేయాలి. ఇంటి గుమ్మాన్ని మామిడి ఆకులతో, పూలమాలలతో అలంకరించాలి. ఆ తరువాత నూతన వస్త్రాలు ధరించి, కులదైవాన్ని పూజించి పిండివంటలతో భోజనం చేయాలి.

సంబరమంతా సాయంత్రం వేళలోనే!
సాయంత్రం ఇంటి ముందు రంగ వల్లికలు తీర్చిదిద్ది, ఇంటిని దీపాలతో అలంకరించాలి. దీపావళి రోజున వెలిగించే దీపాలకు మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. ఆ శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అలాగే గుమ్మం ముందు తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి.

ధనలక్ష్మీ పూజతో ఐశ్వర్యప్రాప్తి
సాయంత్రం వేళల్లో విశేషంగా లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఈ రోజు ధనలక్ష్మీ పూజ చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజు చేసే లక్ష్మీ పూజలో కొత్త బంగారు, వెండి ఆభరణాలు పెడితే శుభప్రదం. పూజ తరువాత పెద్దలు, పిల్లలు కలిసి ఉత్సాహంగా టపాసులు కాలుస్తారు. గుజరాత్ రాష్ట్రంలో దీపావళి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇలా మూడవ రోజు దీపావళి ఆనందంగా జరుపుకుంటారు.

ఇది కూడా గుర్తుంచుకోండి!
దీపావళికి టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దలు, పిల్లలు జాగ్రత్త వహించాలి. అలాగే ప్రకృతి ప్రేమికులు శబ్దరహితంగా దీపావళి జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. పెద్ద పెద్ద శబ్దాలు చేసే టపాకాయలు కాల్చే ముందు మన పరిసరాల్లో ఉండే పసిపిల్లలు, వృద్ధులు గురించి కొంచెం ఆలోచిస్తే మంచిది. అలాగే ప్రకృతిలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. పెద్ద పెద్ద శబ్దాలు చేసే టపాసుల శబ్దాలకు పక్షులు, పిట్టలు, కుక్కలు, కుందేళ్లు వంటి పెంపుడు జంతువులు కూడా భయంతో వణికిపోతాయి. మన ఆనందం కోసం మరో ప్రాణిని హింసించడం ధర్మం కాదు కదా. అలా అని టపాసులు కాల్చుకోవద్దని ఎవరూ చెప్పరు. రంగురంగుల కాంతులతో వెలుగులు విరజిమ్మే రకరకాల టపాసులు ఎన్నో ఉన్నాయి. ఈసారి దీపావళిని శబ్దరహితంగా, పర్యావరణ హితంగా జరుపుకోడానికి ప్రయత్నిద్దాం పర్యావరణాన్ని ప్రకృతిని పరిరక్షిద్దాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.