IPL 2025 Retention RCB Captaincy Kohli : ఐపీఎల్ 2025 రిటెన్షన్పైనే ఇప్పుడు క్రికెట్ ప్రియుల ఆసక్తి నెలకొంది. ఏయే ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటారు, ఎవరిని వేలంలోకి వదిలేస్తారని ప్రస్తుతం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ధోనీ, కోహ్లీ, కేఎల్ రాహులు, పంత్‌పై ఎక్కువగా కనిపిస్తోంది.
విరాట్ సిద్ధంగా ఉన్నాడా? - రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు వదులుకుని బ్యాటర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో గత మూడు సీజన్లుగా ఫాప్ డుప్లెసిస్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే మెగా వేలానికి ముందు డుప్లెసిస్‌ను రిటెయిన్ చేసుకోవడానికి ఆర్సీబీ ఆసక్తిగా లేనట్లు కనిపిస్తోంది. అదే జరిగితే జట్టుకు మళ్లీ కోహ్లీనే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. చూడాలి మరి విరాట్ కెప్టన్సీ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో.
కేఎల్ రాహుల్, పంత్‌పై ఆసక్తి - ఆర్సీబీ ఈసారి కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌ను కూడా తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కెప్టెన్ బాధ్యతలను విరాట్ తీసుకోకపోతే కేఎల్ రాహుల్‌కు అప్పగించాలని బెంగళూరు భావిస్తోందట. కానీ ఈ విషయంపై ఆర్సీబీ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఏదేమైనా ప్రస్తుతం ఆర్సీబీ కొత్త సారథిగా ఎవరు వస్తారనే విషయంపై తీవ్ర ఆసక్తి కొనసాగుతోంది.
ఇకపోతే ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు కొనసాగుతున్న ప్లేయర్ విరాట్ కోహ్లీనే. 2013 నుంచి 2021 వరకూ కెప్టెన్‌గా ఉన్న అతడు ప్రస్తుతం ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఒకసారి జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. కానీ టైటిల్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది.
IPL Retention Rule: కాగా, ఆరుగురు ప్లేయర్స్‌ను అట్టిపెట్టుకోవడానికి ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ పాలకవర్గం పర్మిషన్ ఇచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఉంటుంది. ఈ లిస్ట్‌ను ప్రకటించడానికి గడువు ఈనెల 31 చివరి తేదీ. మరి ఇప్పటి వరకు అయితే ఏ ఫ్రాంఛైజీ కూడా అధికారికంగా రిటెన్షన్ లిస్ట్‌ను రిలీజ్ చేయలేదు.
ఐపీఎల్ రిటెన్షన్ షో కౌంట్‌డౌన్ షురూ! - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
శ్రేయస్‌ను సంప్రదించని కేకేఆర్ ఫ్రాంచైజీ! - ఇక జట్టుకు దూరమేనా!