ETV Bharat / international

గూగుల్​కు రష్యా బిగ్ షాక్- భూమిపై ఉన్న డబ్బుల కంటే ఎక్కువ ఫైన్!

గూగుల్​కు భారీ ఫైన్ వేసిన రష్యా- ప్రపంచంలో చలామణిలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ మొత్తంలో జరిమానా

Russia Fines Google
Russia Fines Google (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Russia Fines Google : టెక్ దిగ్గజం గూగుల్​కు రష్యాలోని మాస్కో కోర్టు భారీ షాక్ ఇచ్చింది. తమ దేశ యూట్యూబ్ ఛానల్స్​పై వేటు వేసినందుకు గూగుల్​కు 2 అన్​డిసిలియన్ రష్యన్​ రూబిళ్ల (2.5 డెసిలియన్ అమెరికా డాలర్లు) భారీ జరిమానాను విధించింది. అంటే భూమిపై చలామణిలో ఉన్నదానికంటే ఎక్కువ డబ్బును ఫైన్​గా వేసింది.

ఒక అన్​డిసిలియన్​ అంటే 1 తర్వాత 33 సున్నాలు ఉంటాయి. అంటే రష్యా- గూగుల్​కు 2,000,000,000,000,000,000,000,000,000,000,000,000 రూబిళ్ల జరిమానా విధించిందన్నమాట.

అసలేం జరిగిందంటే?
2020 నుంచి ఇప్పటివరకు క్రెమ్లిన్ అనుకూల, ప్రభుత్వ అధికార మీడియా సహా 17 ఛానల్స్​ను యూట్యూబ్ బ్లాక్ చేసింది. ఆ ఛానల్స్​ను పునరుద్ధరించాలని మాస్కో కోర్టు ఆదేశించినా గూగుల్ అందుకు నిరాకరించింది. దీంతో గూగుల్​పై మాస్కో కోర్టు భారీ ఫైన్ విధించింది. గూగుల్ బ్లాక్ చేసిన వాటిలో త్సాగరడ్ టీవీ, రియా ఫ్యాన్, స్పుత్నిక్, ఎన్టీవీ, రష్యా 24, ఆర్టీ, ఛానల్ వన్, జ్వెజ్డా సహా 17 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల యూట్యూబ్ బ్లాక్ చేసిందని తెలిసింది.

ఫైన్ కట్టడం అసాధ్యం!
మాస్కో కోర్టు తమ దేశ యూట్యూబ్ ఛానల్స్​ను పునరుద్ధరించాలని గూగుల్​ను కొన్నాళ్ల క్రితం ఆదేశించింది. అందుకు గూగుల్ ససేమిరా అనడం వల్ల భారీ ఫైన్ విధించింది. రోజుకు 1,00,000 రష్యన్ రూబిళ్లు మొదలుకొని, ప్రతి వారం ఈ ఫైన్ డబుల్ అవుతుంది. ఇంత మొత్తంలో ఫైన్ కట్టడం గూగుల్​కు దాదాపు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తం చలామణిలో ఉన్న డబ్బు కంటే కూడా ఎక్కువ. అలాగే ప్రపంచ జీడీపీ 100 ట్రిలియన్ డాలర్లు కంటే కూడా అధికం. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫా బెట్ సుమారు 2 ట్రిలియన్ అమెరికా డాలర్ల మార్కెట్ క్యాప్​ను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రష్యా కోర్టు విధించిన పైన్ కట్టడం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు.

గతంలో చాలా సార్లు ఫైన్!
రష్యన్ కోర్టులు ఇచ్చే తీర్పు ప్రభావం తమపై పడకుండా గూగుల్ గతంలోనే జాగ్రత్త పడింది. రష్యన్ టీవీ ఛానళ్ల యజమానులకు వ్యతిరేకంగా యూఎస్, యూకే కోర్టులో ముందస్తుగా వ్యాజ్యాలను దాఖలు చేసింది. కాగా, గూగుల్​కు జరిమానా పడడం ఇదే తొలిసారి కాదు. అయితే ఇంత భారీ మొత్తంలో ఫైన్ పడడం మాత్రం ఇదే మొదటిసారి.

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.