ETV Bharat / entertainment

'నన్ను క్షమించండి - NBK 109 టైటిల్ అప్డేట్ అందుకే ఇవ్వలేకపోయాం' : నాగవంశీ

NBK 109 టైటిల్ అప్డేట్ ఇవ్వడం ఎందుకు ఆలస్యమైందో చెప్పిన నిర్మాత నాగ వంశీ!

Balakrishna NBK 109 Title Update Producer Naga vamsi
Balakrishna NBK 109 Title Update Producer Naga vamsi (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Balakrishna NBK 109 Title Update : నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం NBK 109. షూటింగ్​ ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్​ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం హైదరాబాద్​లోని చౌటప్పల్ పరిసర ప్రాంతాల్లో ఎడారి సెట్ వేసుకోని యాక్షన్ సీన్స్​ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇప్పటికే NBK 109 వర్కింగ్ టైటిల్​తో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇటీవలే దసరా కానుకగా టైటిల్ అనౌన్స్​మెంట్​ వస్తుందని అంతా ఆశించారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు దీపావళి వేదికగా వస్తుందని అంతా ఆశిస్తున్నారు.

Producer Naga Vamsi NBK 109 : ఈ క్రమంలోనే NBK 109 నిర్మాత నాగ వంశీ టైటిల్ అనౌన్స్​మెంట్​ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. టైటిల్​ వీడియో రిలీజ్ చేయడానికి మరింత సమయం పడుతుందని పేర్కొన్నారు.

"నిజానికి బాలయ్య NBK 109 సినిమా టైటిల్​ను పండగకు విజువల్స్​తో సహా రూపొందించి అనౌన్స్ చేద్దామనుకున్నాం. ఎందుకంటే పోస్టర్లు వేస్తే ఆ కిక్​ రాదు. వీడియో సీజీలతో మూడిపడి ఉంది. కానీ మాకు సీజీ సమయానికి డెలివరీ అవ్వలేదు. అందుకే ఇంకాస్త డిలే అవతుంది. అభిమానులకు సారీ చెబుతున్నాను. టైటిల్​కు విజువల్​, బ్యాంగ్​తో ఇస్తేనే బాగా హైప్​ వస్తుందని బాబీ దాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. కానీ సీజే వర్క్​ టైమ్ పుడుతంది. అందుకే డిలే అవుతూ వస్తోంది. నవంబర్ రెండో వారంలో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వారం లేదా పది రోజులు సీజే కోసం సమయం పడుతుంది" అని నిర్మాత నాగ వంశీ చెప్పుకొచ్చారు.

కాగా, ఈ చిత్రంలో బాబీ దేఓల్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్​లో చిందులేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్​తో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డాకు మహారాజ్, వీరమాస్, సర్కార్ సీతారాం ఇలా పలు రకాల టైటిల్స్​ వినిపిస్తున్నాయి. బాలయ్యను ఇదివరకు ఎన్నడు చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నారు బాబీ. హై యాక్షన్ ఎంటర్టైనర్​గా రూపొందిస్తున్నారు. గతేడాది విడుదలైన భగవంత్ కేసరి వంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది.

లోకేశ్ యూనివర్స్‌లోకి మరో హీరో కన్ఫామ్​​ - మోస్ట్ డేంజరస్​ సోల్జర్​గా లారెన్స్​

హారర్​ కామెడీ యూనివర్స్​లో ఓ ప్రేమ కథ - డిఫరెంట్​ టైటిల్​తో రష్మిక కొత్త సినిమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.