Music Director GV Prakash Divorce :సినీ ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, డివొర్స్ అనేవి కామన్. సౌత్ టు నార్త్ ఇండస్ట్రీలో ఎందరో ప్రేమ పెళ్లి చేసుకుని విడిపోయిన వారున్నారు. కోలీవుడ్‌లో రెండేళ్ల క్రితం హీరో ధనుశ్, ఐశ్వర్య రజనీకాంత్‌ల డివొర్స్ వ్యవహారం ఎంత హాట్ టాపిక్‌గా మారిందో తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్లీ తమిళ పరిశ్రమలో మరో స్టార్ కపుల్ విడిపోయి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. 11 ఏళ్ల పాటు అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోవడాన్ని ఫ్యాన్స్జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇంతకీ ఎవరా స్టార్ కపుల్ అంటే? - ధనుశ్ స్నేహితుడు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ తాజాగా తన భార్య నుంచి విడిపోయినట్లు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. అయితే విడిపోవడానికి గల కారణాన్ని తెలుపలేదు. "చాలా ఆలోచించి చివరికి విడిపోవాలని నేను, సైంధవి డిసైడ్ చేసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే మా డివొర్స్. మా నిర్ణయాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకొని, మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. మా నిర్ణయం ఇద్దరికి మంచిదని అనుకున్న తర్వాతే డివొర్స్కు సిద్ధమయ్యాం" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ జంట విడిపోవడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.