Most Controversial Movie In India : ఇండస్ట్రీలో కొంత మంది డైరెక్టర్లు పరిధిలను దాటి కొన్ని సినిమాలను తెరకెక్కిస్తుంటారు. అయితే వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిన పలు సినిమాలు రిలీజ్కు ముందు ఆ తర్వాత అనేక కాంట్రవర్సీలను తెరలేపుతుంటాయి. ఇటీవలి కాలంలో వచ్చిన 'కశ్మీర్ ఫైల్స్', 'ది కేరళ స్టోరీ' లాంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. అయితే 90స్లో తెరెకెక్కిన ఓ బాలీవుడ్ మూవీ దేశంలోనే అత్యంత వివాదాస్పద సినిమాగా రికార్డులకెక్కింది. దీనిపై ఏకంగా 34 కోర్టు కేసులు ఉండగా, ఇందులో ఉన్న నటీనటులపై వేధింపులు కూడా జరిగాయట. అయినా ఆ సినిమా బాక్సీఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. అయితే ఈ మూవీకి ఎందుకంత కాంట్రవర్సీగా మారిందంటే ?
1982లో బీఆర్ చోప్రా 'నిఖా' అనే సినిమాను రూపొందించారు. ఇందులో రాజ్ బబ్బర్, దీపక్ పరాశర్, సల్మా అఘా లాంటి బాలీవుడ్ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రిపుల్ తలాక్ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ముందుగా ఈ సినిమాకు 'తలాక్ తలాక్ తలాకే' టైటిల్ పెట్టారు. అయితే పలు కారణాల వల్ల మేకర్స్ ఆ తర్వాత ఆ పేరు మార్చారు.
అయితే సినిమా టైటిల్, కథాంశం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ముస్లింలు ఆందోళన చేపట్టారు. అంతేకాదు ఈ సినిమా నిర్మాతలపై 34 కేసులను పెట్టారు. ఇక ఈ మూవీ స్క్రీనింగ్ కూడా నిలిపివేయాలంటూ ఆందోళన చేపట్టారు. మరికొందరైతే ఈ సినిమాను చూడవద్దని విజ్ఞప్తి చేస్తూ థియేటర్ల వెలుపల పోస్టర్లు కూడా అంటించారు. హీరోయిన్ సల్మా అఘాను వేధింపులకు గురిచేశారు.