Megastar In Prabhas Spirit :పాన్ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలున్నాయి. ఆయన వరుస షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నారు. అందులో ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'స్పిరిట్' ఒకటి. ఈ సినిమాను డాషింగ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కించనున్నారు. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు టాక్. దీంతో ఈ కాంబోపై అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ నటీనటుల (Cast And Crew) ఎంపికపై దృష్టి పెట్టారట. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ సినిమాలో నటించనున్నారని టాక్ వినిపించింది. ఇక మరో స్టార్ హీరో ఈ సినిమాలో భాగం కానున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
మాలీవుడ్ మెగాస్టార్ మమ్మూట్టి (Mammootty) ప్రభాస్ సినిమాలో నటించనున్నారని ఇన్సైట్ టాక్ వినిపిస్తోంది. ఈ మేజర్ ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కానున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో మరికొంత మంది ప్రముఖు నటీనటులు కూడా చేరతారని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫార్మ్ చేయాల్సి ఉంది. కాగా, ఈ సినిమా టీ సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనుంది. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు.