Mokshagna Nandamuri Stylish Look Video Viral : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇదిగో వస్తున్నాడు, అదుగో వస్తున్నాడు అని సినీ వర్గాలు అంటున్నారే తప్పు దీనిపై స్పష్టత రావట్లేదు. బాలయ్య కూడా పలు సినిమా ఈవెంట్స్‌లోనూ తన కొడుకు సినిమాల్లోకి వస్తాడని చెబుతున్నారే తప్పు అసలు అప్డేట్ ఏమీ ఇవ్వట్లేదు.
అయితే గతంలో మోక్షజ్ఞ లుక్స్‌పై హీరో మెటేరియల్ కాదంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటిని బ్రేక్ చేస్తూ మోక్షజ్ఞ స్లిమ్‌గా మారాడు. అప్పడప్పుడు పలు ఈవెంట్లలో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. అలా కొద్ది రోజుల క్రితం అయితే మరింత స్టైలిష్‌గా దర్శనమిచ్చి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేశాడు. హీరో లుక్స్‌తో ఫ్యాన్స్‌తో పాటు అందర్నీ ఇంప్రెస్ చేశాడు.
Mokshagna Latest Photos : ఇదే సమయంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి అంతా సిద్ధమైపోయిందని గట్టిగానే వినిపించింది. అయితే తాజాగా మోక్షజ్ఞ రీసెంట్గా దిగిన స్టైలిష్ లుక్ ఫోటోలకు సంబంధించిన ఫోటోషూట్ వీడియో బయటకు వచ్చింది. ఎల్లో కలర్ టీ షర్ట్‌లో మోక్షజ్ఞ అదిరిపోయే పోజులు ఇచ్చాడు. ఇప్పుడా ఫోటోషూట్ వైరల్‌గా మారింది. దీంతో నందమూరి అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. హీరో రెడీ అయిపోయాడు, మరి సినిమా ఎప్పుడు? అంటూ లైక్స్, కామెంట్లతో సోషల్ మీడియాను హోరత్తిస్తున్నారు.