Miss Universe India 2024 : ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా క్రౌన్‌ను గుజరాత్‌కు చెందిన రియా సింఘా అందుకున్నారు. 18 ఏళ్ల వయసులోనే ఈ అందాల పోటీల్లో గెలిచి అందరినీ ఆకర్షించారు. సుమారు 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని అందుకున్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ఈ పోటీలకు జడ్జీగా వ్యవహరించారు.
ఇక మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని రియా అన్నారు."ఈ రోజు నేను టైటిల్ గెలుచుకున్న మూమెంట్‌ను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కాంపిటిషన్లో పాల్గొనడం కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఈ పొజిషన్‌కు చేరుకోవడం వెనక ఎంతో కృషి ఉంది. గతంలో ఈ పోటీల్లో గెలిచిన వారిని నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను" అని రియా అన్నారు.
మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్ కూడా మనదే!
Miss India World Wide 2024 Title Dhruvi Patel : మిస్ ఇండియా వరల్డ్ వైడ్ - అందాల పోటీలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే టైటిల్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ పోటీల్లో పాల్గొనాలని, విజేతగా నిలవాలని చాలా మంది ప్రవాస భారతీయులైన అమ్మాయిలు, మహిళలు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే అందాల కిరీటాన్ని అందుకోవాలంటే వారికి అందం మాత్రమే కాదు అపార ప్రతిభ, ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి.
అయితే తాజాగా న్యూ జెర్సీలో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు జరిగాయి. ఇందులో ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 కిరీటాన్ని ధ్రువీ పటేల్ దక్కించుకుంది. ఈమె అమెరికాకు చెందిన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యార్థి. "మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్‌ను అందుకోవడాన్ని అపురూప గౌరవంగా భావిస్తున్నాను. కిరీటం కన్నా ఇది ఎక్కువ. ఇది కేవలం కిరీటమే కాదు నా సంస్కృతి, సంప్రదాయలు, విలువలకు ప్రతీక. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు స్ఫూర్తిగా నిలిచే అవకాశాన్ని అందించింది." అని కిరీటం అందుకున్న తర్వాత ధ్రువీ పేర్కొంది. అలాగే తాను బాలీవుడ్ నటి అవ్వాలని, ఇంకా యూనిసెఫ్ అంబాసిడర్‌గా రాణించడం తన కోరిక అని చెప్పింది.
సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ టు మిస్ కర్ణాటక- మోడలింగ్‌లో KGF బ్యూటీ జర్నీ ఇలా! - Srinidi Shetty
అందాల కిరీటమే టార్గెట్- 'మిస్ యూనివర్స్ ఇండియా 2024' ఫైనలిస్ట్‌గా 'ట్రాన్స్' మోడల్ - Trans woman Navya Singh