Mirzapur The Film :పదవి, అధికారం మత్తు పదార్థాలలాంటివనే చెప్పాలి. అవి తలకెక్కితే మనిషి దేన్ని లెక్కచేయడు. ప్రాణం పోయిన పర్వాలేదు కానీ పదవిని, అధికారాన్ని మాత్రం వదులుకోలేడు. ఎందుకంటే తలలు శాశ్వతం కాదు, కిరిటాలే శాశ్వతం. మీర్జాపూర్ సిరీస్ కథ కూడా అదే. అందుకే యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ల్లలో ఈ 'మీర్జాపూర్' కూడా ఒకటి. 'కింగ్ ఆఫ్ మీర్జాపూర్'గా ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటది. ప్రైమ్ వీడియో వేదికగా రిలీజైన ఈ సిరీస్‌కు సంబంధించి అన్నీ సీజన్లు ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అయితే ఇప్పుడీ సిరీస్ సినిమాగా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సిరీస్ నిర్మాతల్లో ఒకరైన ఫర్హాన్ అక్తర్ అఫీషియల్‌గా తెలిపారు. మీర్జాపూర్ ది ఫిల్మ్ పేరుతో ఇది సిద్ధం కానుందని చెప్పారు. ఈ కథలో ఎంతో కీలకమైన కాలీన్ భయ్యా పాత్రలో పంకజ్ త్రిపాఠి కనిపించనున్నారని, గుడ్డు పాత్రలో అలీ ఫజల్, మున్నాగా దివ్యేందు నటించనున్నారని స్పష్టత ఇచ్చారు.
మీర్జాపూర్‌ను సృష్టించిన పునీత్ కృష్ణ ఈ సినిమాకు కథ అందించారు. గుర్మీత్‌సింగ్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. 2026లో సినిమా రిలీజ్ చేస్తామని ఫర్హాన్ ప్రకటించారు.