తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దసరా ట్రీట్​​ - అంతకుమించి అనేలా 'విశ్వంభర' విజువల్ వండర్​ టీజర్​ - VISHWAMBHARA TEASER

దసరా కానుకగా విడుదలైన మెగాస్టార్​ చిరంజీవి 'విశ్వంభర' టీజర్​!

source ETV Bharat
Chiranjeevi Vishwambhara Teaser (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2024, 11:03 AM IST

Updated : Oct 12, 2024, 11:28 AM IST

Chiranjeevi Vishwambhara Teaser : తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, సినీ ప్రియులు దసరా వేడుకలను ఘనంగా జరుపుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు. ఈ వేడుకల్లో విశ్వంభర టీమ్​ కూడా భాగం అయింది. మెగాస్టార్​ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ విశ్వంభర నుంచి టీజర్​ విడుదలైంది. అంచనాలు పెంచేలా సాగిందీ ప్రచార చిత్రం. చిరంజీవి మాస్‌ అవతార్‌, పవర్‌ఫుల్‌ డైలాగులు, గ్రాండ్‌ విజువల్స్‌తో అదిరిపోయింది. టీజర్‌ చూస్తున్నంత సేపు మరో ప్రపంచంలో ఉన్న ఫీలింగ్‌ కలిగేలా దీన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ విశ్వంభర టీజర్​ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది.

"విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి, విస్తరిస్తున్నంత మాత్రానా వెలుగు రాదని కాదు, ప్రశ్నలు పుట్టించిన కాలమే, సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహాయుద్ధాన్ని తీసుకొస్తుంది." అని బ్యాక్​గ్రౌండ్​ వాయిస్​ రాగా, అప్పుడు 'మిత్రా యుద్దం వస్తుందని అన్నావ్ కదా, ఎలాంటి ఉంటుంది ఆ యుద్ధం' అంటూ మరో పాప చెప్పిన డైలాగ్స్‌తో టీజర్ మొదలైపోయింది. ఆ సమయంలో చిరు ఎంట్రీ, యాక్షన్ సీక్వెన్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. టీజర్​లో శ్వేత అశ్వంపై స్వారీ చేస్తూ కనిపించారు మెగాస్టార్. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.

మరో ప్రపంచంలోకి - ఇక ఈ సినిమా కోసం 13 భారీ సెట్‌లతో విభిన్న ప్రపంచాన్ని వశిష్ఠ సృష్టించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో బింబిసార తర్వాత వశిష్ట ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తాడో అని మెగా అభిమానులు ఎదురుచూశారు. అందరి ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఇప్పుడీ విశ్వంభర టీజర్ అదిరిపోయింది. గ్రాఫిక్స్​తో ఓ కొత్త లోకాన్ని సృష్టించారు. మొత్తంగా ప్రపంచాన్ని నాశనం చేసేందుకు దుష్టశక్తి రావడం, వెలుగులు పంచేందుకు మానవాతీత శక్తి రావడం అనే కాన్సెప్ట్​తో విశ్వంభర వస్తున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

పాప సెంటిమెంట్​తోనే - ఇకపోతే బింబిసారలో చిన్న పాపతో కథను ముడిపెడుతూ ఎమోషనల్‌గా తెరకెక్కించాడు వశిష్ఠ. ఇప్పుడు విశ్వంభరలోనూ పాపా కాన్సెప్ట్ హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. మిత్రా అంటూ ఓ చిన్న పాప చెప్పిన డైలాగ్‌తోనే చిరంజీవి ఎంట్రీ ఇవ్వడం హైలైట్​గా ఉంది. ఇక ప్రచార చిత్రం చివర్లో ఆంజనేయుడి విగ్రహం ముందు చిరు ఫైట్ సీన్, చివరి షాట్‌లో ఆంజనేయుడ్ని, చిరంజీవిని ఒకే ఫ్రేమ్​లో చూపించడం అదిరిపోయింది.

ఇకపోతే ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్​పై సినిమాను రూపొందిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇది. చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్​గా నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా నటిస్తున్నారు.

చిరంజీవి స్పెషల్ విషెస్ - దసరా పండగను పురస్కరించుకుని మెగాస్టార్​ చిరంజీవి తన అభిమానులకు, ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. "అందరికీ దసరా శుభాకాంక్షలు. క్రౌర్యంపై శౌర్యం, అసురత్వంపై దైవత్వం, అమానుషంపై మానవత్వం, స్వార్థంపై పరమార్థం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ విజయ దశమి. ఆ దైవిక విజయం స్ఫూర్తిగా మన జీవితాలలో అరిషడ్వర్గాలను ఓడించి ప్రేమను, ఆప్యాయతను, సంతోషాన్ని నింపుకోవాలని ఆశిస్తున్నా" - అని చిరు విషెస్ తెలిపారు.

రూమర్స్​కు ఐశ్వర్యా రాయ్ ఫుల్ స్టాప్​! - ఐదు నెలల తర్వాత రీఎంట్రీ

దసరా వీకెండ్ స్పెషల్ - ఓటీటీలోకి 4 సూపర్ హిట్​ సినిమాలు, 2 సిరీస్​లు

Last Updated : Oct 12, 2024, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details