Allu Sirish Buddy Movie Review :ఈ శుక్రవారం తిరగబడరసామీతో పాటు అల్లు శిరీష్ నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ బడ్డీ కూడా థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ ఈ చిత్ర కథేంటి? సినీ ప్రియులను ఆకట్టుకుందా తెలుసుకుందాం?
కథేంటంటే ? - పైలెట్ అయిన ఆదిత్య (అల్లు శిరీష్) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లో ఉండే పల్లవి (గాయత్రీ భరద్వాజ్)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరూ ఒకరినొకరు చూసుకోకపోయినా ప్రేమను కొనసాగిస్తారు. అయితే సరైన సందర్భం చూసి ఆదిత్యకు తనను పరిచయం చేసుకుని ప్రేమను వ్యక్తపరచాలని అనుకుంటుంది పల్లవి. కానీ ఆమె చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల ఆదిత్యను విధుల నుంచి తొలిగిస్తారు. దీంతో ఆదిత్యను డైరెక్ట్‌గా కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటుంది పల్లవి. కానీ అనుకోకుండా కిడ్నాప్ అవుతుంది. అలానే ఈ కిడ్నాప్ ఘటనలో జరిగిన గొడవ కోమాలోకి వెళ్తుంది. కానీ ఆమె ఆత్మ బయటకు వచ్చి ఓ టెడ్డీబేర్‌లోకి వెళ్తుంది. ఇంతకీ ఆమెను ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేశారు? ఆమె ఆత్మ టెడ్డీలోకి ఎలా దూరింది? పల్లవిని ఆదిత్య ఎలా కాపాడాడు? అన్నదే కథ.
ఎలా సాగిందంటే :ఈ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. సినిమాను ప్రారంభించిన తీరు థ్రిల్లింగ్‌గానే ఉన్నా ఆ తర్వాత 20 నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్. ఆ తర్వాత నుంచి కథంతా మెల్లగా సాగుతుంది. అయితే మధ్యలో వచ్చే ఆస్పత్రి ఫైట్ ఎపిసోడ్, వైజాగ్ పోర్టులో జరిగే యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. సెకండాఫ్‌లో కథ పూర్తిగా హాంగ్‌కాంగ్‌లో నడుస్తుంది. క్లైమాక్స్ ఫైట్ సీన్ మరీ సాగదీతగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కథలో ప్రధాన పాత్రలైన టెడ్డీకి, హీరోకి మధ్య బలమైన ఎమోషన్‌ను చూపించలేదు.