Star Heroine Career Ruined :సక్సెస్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. ముఖ్యంగా సినీ రంగ పరిశ్రమలో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన జర్నీ. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే సూపర్ స్టార్ పేరు దక్కించుకోవడం సులభమైన విషయం కాదు. కానీ, ఓ నటి తొలి సినిమాతోనే బాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా మారింది. తర్వాత వరుసగా బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, గోవింద వంటి వారితో కలిసి నటించింది. కానీ, బాధాకరమైన విషయం ఏంటంటే ఆమెకు సక్సెస్ ఎంత త్వరగా లభించిందో అంతే త్వరగా కెరీర్ నాశనమయ్యింది. కేవలం ఒక్క పొరపాటు ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇంతకీ మనం చెప్పుకునేది ఎవరి గురించో చెప్పలేదు కదా! 52 సంవత్సరాల ఆ నాటి హీరోయిన్ మమతా కులకర్ణి గురించి.
డెబ్యూ ఫిల్మ్
1992లో విడుదలైన 'తిరంగా' చిత్రంతో మమతా కులకర్ణి బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమెతో పాటు రాజ్ కుమార్, నానా పాటేకర్ కీలక పాత్రల్లో కనిపించారు. ఆ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది ఈ భామ.
సూపర్ హిట్ చిత్రాలు
'తిరంగా'తో మంచి పేరు సంపాదించుకున్న మమత తరువాత వరుసగా అంటే 1993లో 'ఆశికీ ఆవారా', 'వక్త్ హై హమారా', 1994లో 'క్రాంతివీర్', 1995లో 'కరణ్ అర్జున్', 'సబ్సే బడా ఖిలాడీ', 'ఆందోళన్', 1996లో 'బాజీ', 1998లో 'చైనా గేట్', 2001లో 'ఛుప్పా రుస్తుం' వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా మారింది.