తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మిమిక్రీ ఆర్టిస్ట్​గా ఎంట్రీ- కట్​చేస్తే స్టార్​ నటుడిగా 200పైగా సినిమాలు- పద్శ శ్రీ అవార్డ్ కూడా! - Mimicry Artist Turns Star Actor - MIMICRY ARTIST TURNS STAR ACTOR

Mimicry Artist Turns Star Actor: 1988లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యాక్టర్ 200కు పైగా సినిమాల్లో నటించారు. మిమిక్రీ ఆర్టిస్టుగా ఈ హీరో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పద్మ శ్రీ అవార్డు కూడా అందుకున్నారు.

Mimicry Artist Turns Star Actor
Mimicry Artist Turns Star Actor (Source: Getty Images)

By ETV Bharat Entertainment Team

Published : Sep 7, 2024, 10:45 PM IST

Mimicry Artist Turns Star Actor:తెలుగు సినీ ప్రేక్షకులకు 'అల వైకుంఠపురంలో' సినిమాతో సుపరిచితమైన జయరామ్ సుబ్రమణ్యం ఒక మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టారని మీలో ఎంత మందికి తెలుసు. కళాభవన్ ఇన్‌స్టిట్యూట్‌లో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన ఆయన 1980ల్లో ఇండస్ట్రీకి వచ్చి వెండితెరపై ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పటివరకూ 200కు పైగా సినిమాల్లో నటించిన ఆయన 2011లో పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు.

తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆయన కేరళలో పుట్టారు. చిన్న వయస్సులోనే తన అన్న వెంకిటరామన్‌ను కోల్పోవాల్సి వచ్చింది. చెల్లెలు మంజులతో కలిసి పెరంబవూర్ లోనే స్కూలింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కలడీలో గ్రాడ్యుయేషన్ చదివారు. కళలపై ఆసక్తి ఉన్న ఆయన కెరీర్ ఆరంభంలో మెడికల్ రిప్రజంటేటివ్​గా కూడా పని చేశారు. ఆ తర్వాత కళాభవన్​లో మిమిక్రీ ఆర్టిస్టుగా జాయిన్ అయ్యారు. కొంత కాలం తర్వాత పార్వతీ జయరాం అనే నటిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు.

1988లో 'అపారన్' అనే బ్లాక్ బస్టర్ సినిమాతో మలయాళం వెండితెరకు పరిచయమైన ఆయన తొలి సినిమాలోనే డ్యూయెల్ రోల్​లో నటించి మెప్పించారు. ఆ తర్వాత 1993లో రాజసేనన్ దర్శకత్వం వహించిన 'మెలెపరంబిల్ ఆన్వీడు' అనే సినిమాలో నటించారు. ఆ సినిమా జయరాం కెరీర్​ను మలుపు తిప్పింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా 200 సినిమాలకు పనిచేశారు.

'తూవల్ కొట్టారం', 'స్వయంవర పంతాల్' అనే రెండు కేరళ రాష్ట్ర ఫిల్మ్ అవార్డులను కూడా అందుకున్నారు. అంతేకాకుండా 2011లో ఆయనను ప్రతిష్ఠాత్మక అవార్డు పద్మ శ్రీ వరించింది. నటన, మిమిక్రీ మాత్రమే కాకుండా 'ఆల్కూట్టతిల్ ఒరానపొక్కం' అనే పుస్తకాన్ని కూడా రచించారాయన. 2015లో పుస్తకావిష్కరణ చేయగా అందులో ఆయనకు జంతువులపై ఉన్న ప్రేమను ప్రతిబింబించేలా ఉందని పాఠకులు అభిప్రాయపడ్డారు. కొన్నాళ్లకు ఆ పుస్తకాన్ని ఇంగ్లీషులో కూడా "యాన్ ఎలిఫెంట్స్ జర్నీ" అనే పేరుతో అనువదించారు.

ప్రస్తుతం జయరాం తమిళ టాప్ హీరో తలపతి విజయ్ నటించిన 'ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' (GOAT)లో కనిపించారు. వెంకట ప్రభు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా రిలీజ్​కు ముందే మంచి బిజినెస్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. ఇక దీంతో పాటుగా కార్తీక్ సుబ్బరాజ్ డైరక్ట్ చేస్తున్న సూర్య 44 సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు జయరాం.

'సౌత్​లో ఆయన డిఫరెంట్ యాక్టర్' - రైనా ఫేవరట్ తెలుగు హీరో ఎవరంటే? - Suresh Raina Favourite Actor

ఈ రిచెస్ట్ యాక్టర్​ ఆస్తి రూ.11,000 కోట్లు - షారుక్​, టామ్ క్రూయిస్ మాత్రం కాదు! - Richest Actor In World

ABOUT THE AUTHOR

...view details