Meenakshi Chaudhary Comments on Heroes : వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది అందాల భామ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ మదుగుమ్మదే హవా నడుస్తోంది. రీసెంట్‌గానే లక్కీ భాస్కర్, మట్కా చిత్రాలతో ఆడియెన్స్‌ను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మెకానిక్ రాకీ అంటూ హీరో విశ్వక్ సేన్‌తో కలిసి అలరించేందుకు సిద్ధమైంది.
ఈ మెకానిక్ రాకీకి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించారు. ఈనెల 22న ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా, అందులో మీనాక్షి చౌదరి పాల్గొని టాలీవుడ్ హీరోలపై కామెంట్స్ చేశారు. కొందరి హీరోలపై తన అభిప్రాయన్ని చెప్పారు. తన సహనటుల నుంచి తాను నేర్చుకున్న విషయాలను వెల్లడించారు.
"మహేశ్ బాబు క్రమ శిక్షణగా ఉంటారు. కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ఎప్పుడూ ఒకేలా ఉంటారు. దుల్కర్ సల్మాన్ వినయం అంటే నాకు ఎంతో ఇష్టం. వరుణ్ తేజ్‌ది పూర్తిగా జెంటిల్‌మ్యాన్ నేచర్. ఇక విశ్వక్ సేన్ ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఎనర్జిటిక్‌గా ఉంటూ సెట్‌లో సందడి క్రియేట్ చేస్తారు" అని చెప్పారు.
ఇక ఈ వేడుకలో శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ గతంలో తాను విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్‌ను రిజెక్ట్ చేయడానికి కారణాన్ని వివరించారు. ఆ స్క్రిప్ట్ తనకు నచ్చలేదన్నారు. నటీ నటులు సినిమాలను సెలెక్ట్ చేసుకునే క్రమంలో అలా తిరస్కరించడం సహజమే అని అన్నారు. కానీ, అప్పటి నుంచి మంచి స్క్రిప్ట్ ఉంటే విశ్వక్‌తో నటించే అవకాశం కోసం ఎదురు చూసినట్లు చెప్పారు. అప్పటి కన్నా ఇప్పుడు విశ్వక్ బాధ్యతగా ఉన్నారని పేర్కొన్నారు.
కాగా, యాక్షన్ కామెడీ చిత్రంగా మెకానిక్ రాకీ తెరకెక్కింది. సినిమాను రామ్ తాళ్లూరి నిర్మించారు. సునీల్, నరేశ్ వి.కె తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని విశ్వక్ సేన్ అన్నారు. "నాకింత మంచి జీవితాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు. మేమంతా ప్రాణం పెట్టి ఈ సినిమా రూపొందించాం. ఈ మధ్యే సినిమా చూసుకున్నాను. చాలా మంచి చిత్రం చేశాం అనిపించింది. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటి కన్నా చాలా వెరైటీగా ఉంటుంది. ఐదు నిమిషాలు కూడా ఎక్కడా బోర్ కొట్టదు." అని అన్నారు.
మీనాక్షి చౌదరి ఆన్ డిమాండ్ - 4 సినిమాలు పూర్తి, మరో 8 రోజుల్లో ఇంకో 2 చిత్రాలతో!
'అసలు అప్పుడు ఏం జరిగింది?' - నయన్, ధనుశ్ కాంట్రవర్సీ డాక్యుమెంటరీ రివ్యూ