తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTTలోకి 'మత్తు వదలరా 2' - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mathu Vadalara 2 OTT : యంగ్ హీరో శ్రీ సింహా రీసెంట్ బ్లాక్​బస్టర్ 'మత్తు వదలరా' ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Mathu Vadalara 2 OTT
Mathu Vadalara 2 OTT (Source: ETV Bharat)

Mathu Vadalara 2 OTT :యంగ్ హీరో శ్రీ సింహా లీడ్​ రోల్​లో నటించిన సినిమా 'మ‌త్తు వదలరా 2'. 2019లో రిలీజైన 'మత్తు వదలరా' సినిమాకు ఇది సీక్వెల్​గా తెరకెక్కింది. రితేజ్ రానా దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 13న రిలీజైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి ఎంటర్టైన్ చేసిన ఈ సినిమా, తాజాగా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్​ వేదికగా శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సహా, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులో ఉంది. కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ సింహతోపాటు సత్య, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా ఆయా పాత్రల్లో కనిపించి బాగా అలరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details