Mass Maharaja Raviteja Favourite Heroine : తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజా రవితేజకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోగా ఎదిగారు. తన మాస్ అండ్ ఎనర్జిటిక్ యాక్టింగ్తో ఎంతో మంది ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నారు. అలాగే కొత్త దర్శకులతో పాటు హీరోయిన్లకు అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీలోకి ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కొత్త హీరోయిన్లకు ఈయనే కేరాఫ్ అడ్రెస్ అని కూడా అంటున్నారు.
అయితే ఎంత పెద్ద స్టార్ హీరోకు అయిన ఫేవరెట్ హీరో, హీరోయిన్, దర్శకులు ఉండటం సహజం. అలాగే రవితేజ కూడా ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో తనకు నచ్చిన హీరోయిన్ గురించి ప్రస్తావించారు. ఆ ఇంటర్వ్యూలో అనుష్క, ఇలియానా, త్రిష, శ్రియ వీరిలో ఎవరు ఇష్టం అనే ప్రశ్న ఎదురవ్వగా - అనుష్క అంటే తనకు ఇష్టమని, ముఖ్యంగా ఆమె యాక్టింగ్ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.
కాగా, రవితేజ ఇంటర్వ్యూలో అడిగిన హీరోయిన్ల అందరితో ఒక్కో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇలియానాతో ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని వంటి సినిమాలు చేశారు. వీటిలో కిక్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. త్రిషతో చేసిన కృష్ణ చిత్రం చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర అది భారీ విజయాన్ని అందుకుంది. శ్రియతో చేసిన భగీరథ ఆశించిన విజయం సాధించకపోయినా ఆ తర్వాత చేసిన డాన్ శీను మంచి హిట్ అయింది.