Manisha Koirala Fake Death : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పబ్లిసిటీ స్టంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రీసెంట్గా నటి పూనమ్ పాండే చేసిన డెత్ డ్రామా హంగామా అందరికీ తెలిసిందే. ఎందుకంటే తన గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయినట్లు అందర్నీ నమ్మించి ఫూల్స్ చేసింది. ఆ తర్వాత గర్భాశయ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి ఫేక్ ప్రచారం చేసినట్లు చెప్పి తీవ్ర విమర్శకులను ఎదుర్కొంది.
అయితే ఫేక్ ప్రచారం కొత్తేం కాదు. గతంలోనూ ఫిల్మ్ ఇండస్ట్రీలో పూనమ్ పాండే కన్నా ముందే మరో హీరోయిన్ను ఓ సినిమా కోసం చంపేశారట! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తండ్రి, దర్శకనిర్మాత మహేశ్ భట్ ఇలా చేశారు. ఓ సినిమా ప్రచారం కోసం హీరోయిన్ చనిపోయినట్టు ప్రచారం చేశారట. ఆ సినిమా మరెదో కాదు టాలీవుడ్ కింగ్ నాగార్జున, మనిషా కొయిరాలా, రమ్యకృష్ణ కలిసి నటించిన 'క్రిమినల్'.
ఈ చిత్రాన్ని హిందీలో అలియా భట్ తండ్రి మహేశ్ భట్ రిలీజ్ చేశారు. అప్పటికే 'క్రిమినల్'(Nagarjuna Criminal Movie) చిత్రం తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇది విడుదల అయ్యాక కొంతకాలానికి హిందీలో రిలీజ్ చేశారు. ఈ చిత్రం కోసమే నిర్మాత మహేశ్ భట్ మనిషా కొయిరాలా మృతి అంటూ పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలు వచ్చేలా ప్రచారం చేశారట. అప్పటికే మనిషా కొయిరాలా కూడా పెద్ద హీరోయిన్. ఇది చూసిన చాలామంది షాక్ అయిపోయారు.