Manchu Vishnu Prabhas Kannappa : టాలీవుడ్లో భక్త కన్నప్పగా ప్రేక్షకుల గుండెల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. అందుకే మంచి విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప చిత్రంలో ప్రభాస్ కూడా నటించబోతున్నారని ప్రకటించాక అభిమానులు ఆ చిత్రంపై అంచనాలు పెంచుకున్నారు. అయితే ప్రభాస్ శివుడు పాత్రలో, నయనతార పార్వతీగా ఇందులో కనిపించనున్నారని ప్రచారం జరిగింది. పైగా ప్రభాస్, నయనతార చాలాకాలం తర్వాత ఈ సినిమాలో కలిసి నటించబోతున్నారని అభిమానులు సంబరపడ్డారు. అయితే ఇప్పుడు ప్రభాస్ పాత్ర మారింది అంటూ కొత్త ప్రచారం మొదలైంది.
గత వారం ఈ మూవీ రూమర్ అప్డేట్స్ ప్రకారం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారిగా ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నట్లు ట్విట్టర్ ద్వారా ఒక ట్రేడ్ అనలిస్ట్ ఈ విషయాన్ని తెలియజేశారు. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడిగా కనిపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే బాలీవుడ్లో ఓ మై గాడ్, ఓ మై గాడ్ 2 సినిమాలలో దేవుడిగా కనిపించిన అక్షయ్ కుమార్ ఈ సినిమాలో కూడా అదే పాత్ర చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓ మై గాడ్ 2లో ఆయన శివుడిగా కనిపించి ఆకట్టుకున్నారు.
Kannappa Movie Cast and Crew : అందుకే కన్నప్పలోనూ అక్షయ్ శివుడిగా కనిపించేలా దర్శకుడు స్క్రిప్ట్ కాస్త మార్చారని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రభాస్ నందీశ్వరుడిగా చూపించే ప్రయత్నం చేయబోతున్నారట. ఇంకా ప్రభాస్‌కు సంబంధించిన షూట్ ప్రారంభం కాలేదు. కాగా, పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో పాటు కన్నడ టాప్ హీరో శివ రాజ్ కుమార్, మోహన్ బాబు, మధుబాల, బ్రహ్మానందం, ముకేష్ ఋషి, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ కూడా నటిస్తున్నారు. మొత్తంగా భారీ క్యాస్టింగ్‌తో భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది శివరాత్రికి కన్నప్పను థియేటర్లలో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
కన్నప్పలో ప్రభాస్ శివుడు కాదట - ఏ పాత్రలో కనిపించనున్నారంటే? - Prabhas Kannappa - PRABHAS KANNAPPA
Manchu Vishnu Prabhas Kannappa : కన్నప్ప సినిమా విషయంలో మంచు విష్ణు కన్నా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఆయన శివుడు పాత్రలో కనిపించనున్నట్టు జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ కనిపించేంది శివుడి పాత్ర కాదని తెలిసింది. ఇంతకీ ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారంటే?
కన్నప్పలో ప్రభాస్ శివుడ కాదట - ఏ పాత్రలో అంటే?
Published : Apr 15, 2024, 2:21 PM IST