తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ప్రభాస్ మంచి వ్యక్తి, కానీ సౌత్ ఇండస్ట్రీనే అలాంటిది' - 'రాజాసాబ్​' మాళవిక - Malavika Mohanan On Prabhas - MALAVIKA MOHANAN ON PRABHAS

Malavika Mohanan Yudhra : మాళవికా మోహనన్‌ సౌత్ ఇండస్ట్రీతో పాటు ప్రభాస్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలు స్టోరీలో

Prabhas Malavika Rajasaab
Prabhas Malavika Rajasaab (source ETV Bharat and ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2024, 4:17 PM IST

Malavika Mohanan Yudhra : మాళవికా మోహనన్‌ గురించి చాలా మంది సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. 2013లో నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె 'పట్టం పోల్' చిత్రంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మలయాళం, కన్నడ, తమిళ చిత్రాల్లో నటిస్తూ కెరీర్​లో ముందుకెళ్తోంది. రీసెంట్​గానే 'తంగలాన్‌' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆమె తన కొత్త హిందీ చిత్రం 'యుధ్రా' ప్రమోషన్స్​లో పాల్గొన్న ఆమె సౌత్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది! అలాగే 'రాజాసాబ్' చిత్రం కోసం పని చేస్తున్న ఆమె ప్రభాస్​పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

Malavika Mohanan on South Industry :దక్షిణాది చిత్ర పరిశ్రమను ఉద్దేశించి మాళవికా మోహనన్‌ మాట్లాడుతూ - హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత హీరోయిన్లకు ఇవ్వరని చెప్పారు. ఓ సినిమా భారీ సక్సెస్​ను అందుకుంటే హీరోలకు భారీ కానుకలు అందిస్తారని, కానీ హీరోయిన్స్‌కు మాత్రం అలాంటిది ఏమీ ఉండవని అన్నారు. హీరోయిన్లను పెద్దగా గుర్తించరని పేర్కొన్నారు. పైగా ఏదైనా చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయితే హీరోయిన్‌ అన్‌లక్కీ అనే కామెంట్స్ చేస్తారని, ఆమె వల్లనే సినిమా ఫ్లాప్‌ అయినట్లు చూస్తారని చెప్పుకొచ్చింది.

Malavika Mohanan about Prabhas Raja saab :పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌తో స్క్రీన్ షేర్‌ చేసుకోవడంపై మాళవిక మోహనన్ మాట్లాడుతూ "రాజాసాబ్ రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. సినిమాలో నా పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో భాగం అయినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. మూవీ షూటింగ్​ కూడా చివరి దశకు వచ్చేసింది. ప్రభాస్‌ చాలా మంచి వ్యక్తి. ఆయన ఇంటి భోజనం ఎంతో రుచికరంగా ఉంటుంది" అని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా, యాక్షన్‌ ఫిల్మ్‌గా యుధ్రా తెరకెక్కింది. శ్రీధర్‌ రాఘవన్‌ కథ రాయగా రవి ఉద్యావర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సిద్ధాంత్‌ చతుర్వేది హీరోగా నటించారు. ఈ సినిమా మంచి హిట్​ను అందుకుంది.

'విశ్వంభర' షూటింగ్ లేటెస్ట్ అప్డేట్​ - ఎక్కడి దాకా వచ్చిందంటే? - Vishwambara Movie Shooting

'శ్వాగ్' రివ్యూ - శ్రీ విష్ణు ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడినట్టేనా? - Sri Vishnu SWAG Movie Review

ABOUT THE AUTHOR

...view details