తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కుమార్తెలతో అనిల్‌ చివరి మాటలు - తండ్రిని తలుచుకుంటూ మలైకా ఎమోషనల్! - MALAIKA ARORA FATHER DEATH - MALAIKA ARORA FATHER DEATH

Malaika Arora Father Demise : నటి మలైకా అరోరా తండ్రి అనిల్‌ మరణ వార్త్​తో ఆ కుటుంబం విషాదంలో మనిగింది. ఈ నేపథ్యంలో మలైకా తాజాగా తన తండ్రిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. అయితే అనిల్‌ అరోరా మరణించకముందు తమ కుమార్తెలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

Malaika Arora Father Demise
Malaika Arora (IANS)

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 9:24 AM IST

Malaika Arora Father Demise :బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా తండ్రి అనిల్‌ తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మరణ వార్తతో ఆమె కుటుంబంలో విషాదంలో మునిగింది. ఘటన జరిగిన ప్రదేశంలో ఎటువంటి సూసైడ్‌ నోట్ దొరకలేదని. పంచనామా పూర్తయ్యిన తర్వాత మరణానికి సంబంధించిన స్పష్టమైన కారణం తెలుస్తుందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆయన మరణించకముందు తన కుమార్తెలిద్దరికీ ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. మలైకా, అమృతకు ఆయన కాల్ చేసి "నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను. నేను అలసిపోయాను" అంటూ చెప్పినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, తన తండ్రి మరణం తర్వాత ఆయన్ని తలచుకుంటూ మలైకా ఓ ఎమోనల్ పోస్ట్ షేర్ చేశారు. "మా తండ్రి మరణం మమ్మల్ని ఎంతో బాధిస్తోంది. ఆయన చాలా సెన్సిటివ్​ వ్యక్తి. ఫ్యామిలీ పట్ల ఎంతో ప్రేమ చూపేవారు. ఓ తాతగా, ఓ భర్తగా, ఓ తండ్రిగా ఎంతో అంకితభావంతో, ప్రేమతో ఉండేవారు. ఆయన ఇకలేరని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాం. ఇది మాకు తీరని నష్టం. ఈ కష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను. మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే అనిల్‌ అరోరా మరణించిన సమయంలో మలైకా అరోరా పుణెలో ఉన్నారు. ఈ విషయం తెలియగానే ఆమె ముంబయి చేరుకున్నారు. ఇక మలైకా మాజీ భర్త, నటుడు అర్బాజ్‌ ఖాన్‌, అలాగే నటుడు సల్మాన్‌ఖాన్‌ కుటుంబ సభ్యులు ఈ విషయం తెలిసి మలైకాను పరామర్శించారు.

Malaika Arora Hit Songs :హిందీ సినిమాల్లో స్పెషల్​ సాంగ్స్​తో పాటు, హీరోయిన్​గా నటించి స్టార్‌ ఇమేజ్​ను సొంతం చేసుకున్న మలైకా అరోరా. ఛల్​ ఛయ్యా ఛయ్యా, మున్నీ బద్నామ్‌ వంటి పలు పాపులర్‌ స్పెషల్ సాంగ్స్​తో ప్రేక్షకుల మనసు దోచారు. అయితే ఆమె గత కొంత కాలంగా సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. పలు షోలకు మాత్రం న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫిట్​నెస్​ వీడియోలతో హెల్త్​పై అవగాహన పెంచుతున్నారు. అలానే గ్లామర్ షో కూడా చేస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే గతంలో భర్తతో విడాకులు తీసుకున్న ఆమె రీసెంట్​గా తన బాయ్​ ఫ్రెండ్​ హీరో అర్జున్​ కపూర్​తోనూ విడిపోయారు.

మలైకా అరోరా తండ్రి బలవన్మరణం - టెర్రస్​పై నుంచి దూకి - Malaika Aroras father Kills self

ABOUT THE AUTHOR

...view details