Mahesh Babu SSMB 29 :సూపర్ స్టార్ మహేశ్‌బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రూపొందనున్న 'SSMB 29'పై అటు అభిమానులతో పాటు మూవీ లవర్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి దీనికి సంబంధించి ఏ రూమర్ వచ్చినా దాన్ని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. డైరెక్టర్ రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమా గురించి పలు హింట్స్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం మహేశ్‌బాబు, రాజమౌళి అండ్ టీమ్ కొన్నిరోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని తర్వాత వాళ్లందరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అందులో మహేశ్ కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆకర్షించారు. పొడవాటి జుట్టు, గడ్డంతో సూపర్ కూల్‌గా కనిపించారు. అయితే లుక్ టెస్ట్‌లో భాగంగానే మూవీ టీమ్ దుబాయ్‌కు వెళ్లిందని సినీ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో మహేశ్‌కు సంబంధించి మొత్తం ఎనిమిది లుక్స్‌ను మూవీ టీమ్ రెడీ చేసిందని టాక్.
ఇండియన్ సినిమానే చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ SSMB 29లోఆవిష్కరించనున్నట్లు అప్పట్లో రైటర్ విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగునుందని, మూవీ పలువురు వీదేశీ నటులు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.