Mahesh Babu Son Gautam Birthday :టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తాజాగా తన తనయుడు గౌతమ్ బర్త్‌డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్ట్ పెట్టి విష్ చేశారు. "హ్యాపీ 18 మై సన్. ఈ సమయంలో ఎన్నో విషయాలను నువ్వు అన్వేషించు. ఎంజాయ్ చెయ్. లవ్ యూ. ఒక తండ్రిగా ఈరోజు నేనెంతో ఆనందంగా ఉన్నా" అంటూ ఏమోషనల్ నోట్ షేర్ చేశారు.
ఇక గౌతమ్ తల్లి నమ్రత కూడా ఇన్‌స్టా వేదికగా విష్ చేశారు. "హ్యాపీ బర్త్‌డే మై సన్. నీ విషయంలో మేమెంతో ఆనందిస్తున్నాం. ఈ టైమ్ మనకు చాలా స్పెషల్. జీవితంలో నువ్వు ఇలాగే ప్రకాశించాలని కోరుకుంటున్నాను. లవ్ యూ" అంటూ స్పెషల్ నోట్ రాసుకొచ్చారు.
లండన్‌లో గౌతమ్ ఫస్ట్ పెర్ఫామెన్స్
Mahesh Babu Son Gautam First Performance:సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ తన కెరీర్లో తొలిసారి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లండన్ యూనికార్న్ థియేటర్‌లో గౌతమ్ ఘట్టమనేని పెర్ఫార్మెన్స్ చేశాడు. తమ ముద్దుల కుమారుడి టాలెండ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు మహేశ్ ఫ్యామిలీ లండన్ వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఫొటోలను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ షోకు మహేశ్, నమ్రతతోపాటు సితారా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ హాజరయ్యారు.