SSMB 29 Movie Update :సూపర్ స్టార్ మహేశ్‌బాబు లీడ్ రోల్లో దర్శకధీరుడు రాజమౌళి #SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. సినిమానూ రెండు పార్ట్‌లుగా తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా కథకు ప్రాధాన్యం ఉండడం వల్ల ఒకే పార్ట్‌లో చెప్పడం సాధ్యం కాదని మేకర్స్ భావిస్తున్నారట. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ కథ కావడం, భారీ బడ్జెట్ కేటాయించడం, అలాగే స్టార్ నటీనటులు ఉండడం వల్ల రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ అడ్వెంచర్ జానర్‌లో సీక్వెల్స్ కూడా వస్తాయని మరో ప్రచారం సాగుతోంది. అంటే 'ఇండియానా జోన్స్' మాదిరిగా ఒకదాని తర్వాత మరొకటి రావొచ్చని అంటున్నారు. కీ రోల్స్ అలాగే ఉండి, స్టోరీ మారుతుందట. అయితే దీని గురించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.