Mahesh Babu Rajamouli Movie Launching: సూపర్ స్టార్ మహేశ్‌బాబు- దర్శకధీరుడు రాజమౌళి సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి క్రేజ్ వరల్డ్‌వైడ్‌గా పెరిగింది. ఇటు మహేశ్‌బాబుకు కూడా ఫుల్ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో SSMB29 (టెంపరరీ టైటిల్) రోజూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి న్యూస్ వైరల్‌గా మారింది. 2024 ఏప్రిల్ 9 ఉగాది పండగ రోజున మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ (SSMB29) అఫీషియల్‌గా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ వేసవిలోనే సెట్స్‌పైకి వెళ్లనుందట. ఇక రెండేళ్లలోపే షూటింగ్ కంప్లీట్ చేసి 2026 ఉగాదికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. అయితే ఈ విషయం గురించి ఎలాంచి అధికారిక సమాచారం లేదు. కానీ, ఇప్పటికే కేఎల్ నారాయణ సినిమా ప్రొడ్యుసర్‌గా కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా సినిమా హక్కుల కోసం ట్రై చేస్తున్నట్లు టాక్.
స్క్రిప్ట్ వర్క్ పూర్తి!మహేశ్- రాజమౌళి సినిమా స్క్రిప్ట్ (Script)కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా స్ట్రిప్ట్ పూర్తైందని చెప్పారు. కాగా, బ్లాక్ బస్టర్ మూవీస్ బాహుబలి, ఆర్ఆర్ఆర్కు కూడా స్ట్రిప్ట్ అందించింది విజయేంద్ర ప్రసాదే.