Mahesh Babu First Bike :సూపర్ స్టార్ మహేశ్ బాబు రీసెంట్గా గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ మంచి వసూళ్లనే అందుకుంది. గురూజీ మ్యాజిక్ మిస్ అయినప్పటికీ మహేశ్ క్రేజ్ అండ్ సూపర్ యాక్టింగ్‌తో బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయిపోయింది. అయితే ప్రస్తుతం మహేశ్ తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ లెవల్లో తెరకెక్కించనున్నారు జక్కన్న. ఈ మూవీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒకటి సినిమాకు సంబంధించినదో లేదా మహేశ్‌కు సంబంధించినదో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంది. అలా ఈ సారి మహేశ్‌కు సంబంధించిన త్రోబ్యాక్ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి నెట్టింట్లో బయటకు వచ్చింది. అసలే సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రేక్షకుల్లో ఉంటుంది. దీంతో ఇప్పుడు బయటకు వచ్చిన తాజాగా ఆసక్తికరమైన విషయం ఫుల్ ట్రెండ్ అవుతోంది.
ఇంతకీ అదేంటంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్ తాను నడిపిన ఫస్ట్ బైక్ గురింటి చెప్పుకొచ్చారు. మీరు మొదటగా నడిపిన బైక్ ఏంటి అని అడగగా దానికి మహేశ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. తాను మొదటి సారి నడిపిన బైక్ టీవీఎస్ కంపెనీకి చెందిన టీవీఎస్ 50 అని చెప్పారు. తన 11 ఏళ్ల వయసులోనే బైక్ నడపడం మొదలు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయమే బయట చక్కర్లు కొడుతోంది.